Jabardasth : జబర్దస్త్ కు పూర్వ వైభవం రావాలంటే ఆ రెండు పనులు చేయాలి
Jabardasth : 2013 సంవత్సరంలో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయిన సమయంలో జనాలు పెద్దగా ఆ షో గురించి పట్టించుకోలేదు. వారాలు గడుస్తున్నా కొద్ది షో కు జనాలు ఆకర్షితులు అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే తెలుగు బుల్లి తెర ను శాషించే స్థాయికి జబర్దస్త్ చేరింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా.. ఎవరు వెళ్లినా కూడా దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పాటు మంచి రేటింగ్ సాధిస్తూ తెలుగు లోనే కాకుండా సౌత్ ఇండియాస్ నెం.1 టీవీ షో అన్నట్లుగా రికార్డు దక్కించుకున్న జబర్దస్త్ కు ఇప్పుడు కష్టకాలం తప్పడం లేదు. అద్బుతమైన రేటింగ్ ను అప్పట్లో దక్కించుకున్నజబర్దస్త్ నుండి ఈమద్య రోజా.. హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్.. అదిరే అభి.. గెటప్ శ్రీను ఇంకా కొందరు కమెడియన్స్ వెళ్లి పోయారు.
వారందరు కూడా జబర్దస్త్ కు దూరం అవ్వడంతో షో రేటింగ్ చాలా దారుణంగా పడిపోయింది. జడ్జ్ ల విషయంలో ఏమాత్రం ఆసక్తి లేకుండా అయ్యింది. ఇంద్రజ ఫుల్ టైమ్ జడ్జ్ గా మారగా మనో అప్పుడప్పుడు వస్తూ కనిపిస్తూ వెళ్తున్నాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ ల విషయమై షో నిర్వాహకులు చాలా లైట్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త టీమ్ లు లేవు.. కొత్తగా కంటెస్టెంట్స్ కు అవకాశం ఇవ్వడం లేదు. జబర్దస్త్ పరిస్థితి మారాలి అంటే టీమ్ లను వెంటనే సర్దుబాటు చేయాలి. స్పెషల్ స్కిట్ అని కాకుండా ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేసి మంచి కామెడీ టైమింగ్ ఉన్న వారిని టీమ్ లీడర్లను చేసి వారికి బాధ్యత అప్పగించాలి. తద్వారా ఖచ్చితంగా చాలా క్వాలిటీ కంటెంట్ అనేది వస్తుంది. టీమ్ లీడర్లకు కంటెంట్ క్రియేట్ చేయడం లో వారికి ప్రతిభకు అవకాశం ఇవ్వాలి.
డైరెక్షన్ టీమ్ అందులో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఇక గతంలో మాదిరిగా షో టైమ్ కూడా పెంచాలి. రేటింగ్ రావడం లేదని టైమ్ తగ్గించడం వల్ల జనాలు చూడటం తగ్గించారు. గతంలో ఒక్కో స్కిట్ పది నుండి పన్నెండు నిమిషాలు ఉండేది. ఇప్పుడు అది కేవలం ఏడు నుండి ఎనిమిదికి మార్చారు. కనీసం పది నిమిషాలు ఉంటేనే స్కిట్ లో చెప్పాలి అనుకున్నది చెప్పడానికి బాగుంటుంది. అందుకే ఈ మార్పులు చేసి జబర్దస్త్ కు మళ్లీ ప్రాణం పోస్తే బాగుంటుందని నిర్వాహకులను ప్రేక్షకులు కోరుతున్నారు.