Game Changer : గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ అంతా త‌ర‌లి రానుందా.. అల్లు అర్జున్ కూడానా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Game Changer : గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ అంతా త‌ర‌లి రానుందా.. అల్లు అర్జున్ కూడానా..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Game Changer : గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ అంతా త‌ర‌లి రానుందా.. అల్లు అర్జున్ కూడానా..!

Game Changer : ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించే సినిమాల‌కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు చ‌రిత్ర సృష్టించే సినిమాలు తీసి టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు శంక‌ర్.శంకర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. శంకర్ ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో చరణ్ Ram Charan సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూశారు. ఇక శంకర్ తో సినిమా అనగానే పక్కగా హిట్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు.

Game Changer గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ అంతా త‌ర‌లి రానుందా అల్లు అర్జున్ కూడానా

Game Changer : గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ అంతా త‌ర‌లి రానుందా.. అల్లు అర్జున్ కూడానా..!

Game Changer మెగా ఈవెంట్..

జ‌న‌వ‌రి 10న గేమ్ ఛేంజ‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా,ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మూవీ ప్రమోష‌న్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల అమెరికాలో మూవీ ఈవెంట్ గ్రాండ్‌గా జ‌రిగింది. ఇక ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సన్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రీ యూనియన్ కాబోతుందా..?, మెగా అభిమానులు జీవితంలో మర్చిపోలేని ప్రీ రిలీజ్ ఈవెంట్ గా మారబోతుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడనే వార్త ఎప్పుడో తెలిసింది.

అయితే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ఈవెంట్ కి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, చిరంజీవి, అల్లు అర్జున్ కూడా హాజరు కాబోతున్నాడని టాక్. దిల్ రాజు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడట. ఏ క్షణం లో అయినా శుభ వార్త వినొచ్చని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దాదాపు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని సంద‌డి చేస్తార‌ని స‌మాచారం. గ‌త కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పేర్లు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో మారు మోగిపోతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్లిద్దరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది అంటూ మీడియా లో ఎప్పటి నుండో ఒక ప్రచారం ఉంది.మరి ఈ ఈవెంట్‌తో వాట‌న్నింటికి పులిస్టాప్ ప‌డుతుందా లేదా అనేది చూడాలి

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది