Samantha-Naga chaithanya: అక్టోబర్ 7న సమంత – నాగ చైతన్య ఏం చెప్పబోతున్నారు..ప్రతీ ఒక్కరు ఆరోజు కోసమే ఎదురు చూపులు
Samantha-Naga chaithanya: అక్టోబర్7..ఇప్పుడు సమంత – నాగ చైతన్యలకి సంబంధించిన న్యూస్ ఏదో రాబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకీ హాట్ టాపిక్‌గా మారిన స్టార్ కపుల్ సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం అని అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ఏ మాయ చేశావేతో ఇద్దరు ప్రేమలో పడి ఒకరిని ఒకరు ఎంతగా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారో తెలిసిందే. అలాంటి జంట ఇప్పుడు విడాకుల వరకు వెళ్లటం వెనుక పలు కారణాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

everyone are eagerly waiting for october 7th about samantha-naga-chaithanya- message
ఈ వ్యవహారం మొత్తానికి నాగ చైతన్య భార్య కారణమనే విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది. నాగ చైతన్యతో గ్యాప్ ప్రారంభం కాగానే సమంత ముందు తన ఇంటి పేరుగా ఉన్న అక్కినేని పదాన్ని సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి తీసేసారు. ఆ తర్వాత ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్‌లు పెడుతూ వస్తోంది సమంత. తిరుమలలో శ్రీ వారి దర్శనం కోసం వచ్చిన సమయంలోనూ మీడియా వారి మీద ఇదే విషయంలో సీరియస్ అయ్యారు. ఇక ఇదే విషయంపై ఇటీవల నాగ చైతన్య ‘లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్‌లో స్పందించారు. ఇప్పుడు మీడియా కవరేజ్ విషయంలో చాలా మార్పులు చూస్తున్నామని చైతూ తెలిపాడు.
Samantha-Naga chaithanya: సమంత – చైతన్య విడాకుల వార్తలు ఆగడం లేదు.
ఒకప్పుడు కంటే ఇప్పుడు డిజిటల్ మీడియా వల్ల ఉన్నది లేనిది..పర్సనల్ విషయాలు ఎవరికి వచ్చినట్టు వారు రాసేస్తున్నారు..అంటూ చెప్పుకొచ్చాడు. నాగచైతన్య చెప్పిన తర్వాత కూడా సమంత – చైతన్య విడాకుల వార్తలు ఆగడం లేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అక్టోబర్ 7న సమంత, చైతూ విడాకులు, వాళ్ళ బంధంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ రోజు స్టార్ కపుల్ 4వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోనున్నారు. పెళ్లి రోజు సోషల్ మీడియా వేదికగా వారి స్పందన, కామెంట్స్, పోస్ట్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి దీనిపై ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్తారో.