Rocking Rakesh : బాబు రాకింగ్ రాకేష్.. సుజాత కాకుండా మరెవ్వరు కనిపించడం లేదా?
Rocking Rakesh : ఈటీవీ జబర్దస్త్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న రాకింగ్ రాకేష్ టీం గత కొంత కాలంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో విఫలం అవుతుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. రాకింగ్ రాకేష్ గతంలో చిన్న పిల్లలతో ఎంతో మంచి కామెడీ చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే వాడు. చిన్న పిల్లలతో తనపై పంచ్ లు వేయించుకొని వారిని పెద్ద వారిగా చూపించి ఒక కొత్త తరహా కామెడీ జబర్దస్త్ లో అతడు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. చాలా కాలం పాటు వారితో కామెడీ చేయించి చిన్న పిల్లలతో కూడా ఇంత బాగా కామెడీ చేయించవచ్చా అన్నట్లుగా అతడు మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత పలు రంగాలకు చెందిన ప్రముఖు వ్యక్తులను తీసుకొచ్చి జబర్దస్త్ లో ప్రేక్షకుల ముందు పరిచయం చేశాడు. వారు ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్ గా నిలవడంతో పాటు వారితో కామెడీ కూడా చేయించడం వల్ల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అదంతా గతం ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన చేసిన కామెడీ స్కిట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రతి ఎపిసోడ్లో కూడా ఆయన కామెడీ స్కిట్ సో సో గానే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ప్రతి ఎపిసోడ్ కూడా ఒకే రకమైన థీమ్ ను అతడు వాడుతున్నాడు. ముఖ్యంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా సుజాతతో నే స్కిట్ లు చేస్తూ అలరించలేక పోతున్నాడు.ఇటీవల సుజతను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రాకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.

evt jabardasth rocking rakesh team comedy flop
తన కాబోయే భార్య జోర్దార్ సుజాతను తన ప్రతి స్కిట్ లో కూడా చూపిస్తూ ఆమె మీద పంచులు వేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరికీ జోడి మొదట్లో ఆకట్టుకుంది. కాని ఇప్పుడు కాదు. ఇక వీరికి జతగా ప్రవీణ్ కామెడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. స్కిట్ లో ఇతర నటీనటులు కూడా సో సో కామెడీ నే చేస్తున్నారు. కానీ అది కూడా వర్కౌట్ కావడం లేదు. అందుకే రాకింగ్ రాకేష్ చేసే ప్రతి ఒక్క కామెడీ సుజాత మాత్రమే కాకుండా ఎవరైనా కొత్తగా ఉంటే బాగుంటుంది అని టాక్ వినిపిస్తుంది. గతంలో మాదిరిగా రాకేష్ మళ్లీ మంచి పేరు దక్కించుకోవాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చిన్న పిల్లలతో మరియు విభిన్నమైన రంగాల వారితో రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో మళ్లీ సందడి చేయాలని కోరుకుంటున్నారు.