Jabardasth Faima : ఇన్నాళ్లూ చీ కొట్టారు.. అదరగొడుతున్న జబర్దస్త్ ఫైమా!
Jabardasth Faima టాలెంట్ అందరిలోనూ ఉంటుంది. కానీ దాన్ని నిరూపించుకునేందుకు టైం రావాలి. అలా జబర్దస్త్ ఆర్టిస్ట్ ఫైమా Jabardasth Faima కు ఇప్పుడు సమయం వచ్చింది. ఇంతకు ముందు పటాస్ షోలో కనిపించిన ఫైమా గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్‌లో రచ్చ చేస్తోంది. అయితే ఆమె శరీరాకృతి, కలర్, ఆమె ఉండే తీరుపై సెటైర్లు, కౌంటర్లు వేస్తూ స్కిట్లు వేసే వారంతా. ఆమె కూడా వాటిని అంత సీరియస్‌గా తీసుకునేది కాదు. దారుణాతి దారుణంగా ఆమెను ఆడుకునే వారు. నటన కూడా రాదని గేలి చేసేవారు.

Faima acting impresses over getup srinu in jabardasth
అదరగొడుతున్న జబర్దస్త్ ఫైమా Jabardasth Faima
కానీ ఫైమా Jabardasth Faima కు ఇప్పుడు టైం వచ్చింది. అందరినీ తన నటనతో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఏకంగా గెటప్ శ్రీను వంటివాడితోనే పోటాపోటీగా గెటప్పులు వేసి నటిస్తోంది. గెటప్ శ్రీను నటనలో ఎంతటి భిన్నత్వాన్ని చూపిస్తాడో అందరికీ తెలిసిందే. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో రోహిణి, ఫైమా హైలెట్ అయ్యారు. రోహిణి ఆల్రెడీ నిరూపించుకున్నారు. ఆమె కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు.

Faima acting impresses over getup srinu in jabardasth
కానీ ఫైమా మాత్రం ఈసారి దుమ్ములేపేసింది. బుల్లెట్ భాస్కర్ టీంలోనూ రచ్చ చేసింది. ఇక గెటప్ శ్రీను చేసిన ఓ స్కిట్‌లోనూ హల్చల్ చేసింది. గెటప్ శ్రీనుకు అలవాటైన ఆ గెటప్‌లో రోహిణి, ఫైమా దుమ్ములేపేశారు. మరీ ముఖ్యంగా ఆ నడక తీరును కూడా ఫైమా పట్టేసింది. ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ కూడా ఫైమా Jabardasth Faima అవలీలగా అనుకరించింది. మొత్తానికి నెటిజన్లు ఇప్పుడు ఫైమా జపమే చేస్తున్నారు. యూట్యూబ్‌లో అంతా కూడా ఫైమాకు సంబంధించే కామెంట్లు పెడుతున్నారు.
