Bigg Boss 6 Telugu : ఎవిక్షన్ పాస్ ఫైమా సొంతం.. ఇసుక మోసి మూలన పడ్డ రేవంత్, శ్రీహాన్.. తన జబర్దస్త్ ప్లాన్ ఏంటో చెప్పి షాక్ ఇచ్చిన ఫైమా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : ఎవిక్షన్ పాస్ ఫైమా సొంతం.. ఇసుక మోసి మూలన పడ్డ రేవంత్, శ్రీహాన్.. తన జబర్దస్త్ ప్లాన్ ఏంటో చెప్పి షాక్ ఇచ్చిన ఫైమా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :19 November 2022,8:20 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్సీజన్ 6 లో ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకుంది ఫైమా. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఎవిక్షన్ పాస్ గెలిచి తన సత్తా చాటింది ఫైమా. అయితే ఈ టాస్క్ లో ఇసుక బస్తాలు వారికి ఇచ్చిన గడతో మోయాల్సి ఉంటుంది. హౌజ్స్ మెట్స్ అంతా కూడా తమకు కేటాయించిన బస్తాలన్ని రేవంత్, శ్రీహాన్ ల గడలకే తగిలించారు. ఫైమాకి కేవలం ఒక్క శ్రీసత్య మాత్రమే రెండు ఇసుక బస్తా మూటలు వేసింది.

రేవంత్, శ్రీహాన్ లకు ఈ ఎవిక్షన్ పాస్ అవసరం లేదని చెబుతూ వారి మీద తన ఆట ప్రదర్శించారు మిగతా హౌస్ మెట్స్. ఫైనల్ గా ఎవిక్షన్ పాస్ ఫైమా సొంతమైంది. అయితే తను గెలుచుకున్న ఈ ఎవిక్షన్ పాస్ తన కోసమే కాదు తనకు నచ్చిన వారు హౌజ్ లోంచి వెళ్లిపోతున్నా కూడా వాడుతా అని అన్నది ఫైమా. అక్కడ ఫైమా ప్రేక్సకుల మనసు గెలుచుకుంది. ఎవిక్షన్ పాస్ తో ఫైమా ఇక టాప్ 5 లో తప్పకుండా వెళ్తుందని ఫిక్స్ అవ్వొచ్చు. తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తూ వస్తున్న ఫైమా నాగార్జున ఇచ్చిన సలహాలతో ఈ వారం కొద్దిగా వెటకారం తగ్గించేసింది..

faima got eviction pass in Bigg Boss 6 Telugu

faima got eviction pass in Bigg Boss 6 Telugu

మొత్తానికి ఫైమా బిగ్ బాస్ సీజన్ 6 లో తన మార్క్ చూపిస్తూ వస్తుంది. వారాలు తగ్గుతున్నా కొద్దీ బిగ్ బాస్ ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. రేవంత్ టైటిల్ విన్నర్ అని ఇప్పటికే కొందరి డిక్లేర్ చేస్తున్నారు. కానీ అతని మాటలు అతనికి కాకుండా వేరే వాళ్లకి టైటిల్ ఇచ్చేలా చేస్తున్నాయి. మరి బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారన్నది తెలియాల్సి ఉంది. ఎవిక్షన్ పాస్ వచ్చింది కదా అని ఫైమా రిలాక్స్ అయితే మాత్రం ఆమెకి నెక్స్ట్ వీక్ ఓట్లు పడే ఛాన్స్ లేదు. అందుకే ఫైమా మ్యాక్సిమం డేంజర్ లో రాకుండా ఆడితే తనకు వచ్చిన ఈ ఎవిక్షన్ పాస్ వేరొకరికి వాడే ఛాన్స్ ఉంటుంది.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది