Bigg Boss Telugu 7 : అది రీజనా.. కొట్టేసుకున్న ప్రిన్స్ యావర్, అర్జున్ కృష్ణ.. బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేసిన యావర్

Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మాయాస్త్ర కోసం జరుగుతున్న పోటీలో మాయాస్త్ర భాగాలను ఆట బాగా ఆడిన వారికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడం హౌస్ లో పెద్ద రచ్చ లేపింది. బిగ్ బాస్ కి కావాల్సిందే రచ్చ కదా. హౌస్ లో రచ్చ లేపి సైలెంట్ గా చూస్తూ కూర్చొన్నాడు. ఈ విషయంలో మాత్రం చాలామంది బాధపడ్డారు. ముఖ్యంగా మహాబలి టీమ్ కి చెందిన సభ్యులు అయితే చాలా అంటే చాలా ఓవర్ చేశారు. అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్ అయితే చాలా ఓవర్  చేశారు. గౌతమ్ చివరకు శివాజీకి మాయాస్త్ర భాగం ఇస్తాడు. ప్రిన్స్ నుంచి తీసుకుంటాడు. దీంతో ప్రిన్స్ అస్సలు ఒప్పుకోడు. నువ్వు ఎలా నన్ను అన్ డిజర్వడ్ అంటావు అంటూ రెచ్చిపోతాడు. నేను ఒప్పుకోను అంటాడు ప్రిన్స్. రచ్చ రచ్చ చేస్తాడు. అసలు నేను ఈ ఇంట్లో ఉండను. నేను ఇంటికి వెళ్లిపోతా.. డోర్ ఓపెన్ చేయండి అంటాడు ప్రిన్స్. లేకపోతే నేను ఫుడ్ తినను అంటాడు యావర్.

Advertisement
fight between arjun krishna and prince yawar in bigg boss telugu 7
yawar

ఇదంతా పక్కన పెడితే రెండో పవరాస్త్ర కోసం జరిగిన పోటీలో శివాజీ, షకీలా ఇద్దరే పోటీ పడబోతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి పోటీ పెడతారు. వాళ్లలో ఒకరు రెండో పవరాస్త్రను పొందబోతున్నారు. అయితే.. ప్రిన్స్ పోటీలో లేకపోవడంతో రెచ్చిపోయాడు. కోపంతో రగిలిపోయాడు. అర్జున్ మీదికి వెళ్లాడు. దీంతో నీ బాడీ నాకు చూపించకు. నువ్వు ఇంజెక్షన్లు వేసుకొని బాడీ చూపిస్తున్నావు. నేను డాక్టర్ ను అంటూ అన్నాడని ప్రిన్స్ కోపంతో రచ్చ రచ్చ చేశాడు. బిగ్ బాస్ నేను ఇంజెక్షన్లు వేసుకున్నానా? నేను ఈ ఇంట్లో ఉండను. నేను వెళ్లిపోవాలి. నన్ను వదిలేయండి. నేను వెళ్తా.. అంటూ రచ్చ రచ్చ చేశాడు.

Advertisement

Bigg Boss Telugu 7 : ప్రిన్స్ నిజంగానే డిజర్వా?

అయితే.. ప్రిన్స్ డిజర్వ్ అని చాలామంది అన్నారు. రతిక కూడా ప్రిన్స్ డిజర్వ్ పర్సన్. ఆయనకు కాకుండా ఎలా ఇస్తారు. షకీలా ఎలా డిజర్వ్ అవుతుంది అంటూ ప్రిన్స్ రచ్చ రచ్చ చేస్తాడు. చాలా ఆవేశపడతాడు. ఇలాంటి ఫేక్ పీపుల్ మధ్య నేను ఉండలేను అంటాడు. దీంతో ఆట సందీప్ ఇక్కడ ఇలాగే ఉంటారు. నువ్వు అంత ఆవేశపడకు అంటూ ఓదార్చుతాడు. అలాగే.. అమర్ దీప్ కూడా ప్రిన్స్ ను ఓదార్చాడు. దీంతో కాసేపు యావర్ కూల్ అయ్యాడు.

Advertisement
Advertisement