Mogilaiah : బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత..!
ప్రధానాంశాలు:
Mogilaiah : బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత..!
Mogilaiah : బలగం సినిమాలో భావోద్వేగంతో అలరించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) గురువారం తెల్లవారుజామున వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మొగిలయ్య బలగం క్లైమాక్స్ సమయంలో తన మనోహరమైన పాటతో ప్రేక్షకుల హార్ట్‌ను టచ్ చేశాడు, అది మూవీ భారీ విజయానికి కారణమైంది.
మెగాస్టార్ చిరంజీవి, బలగం దర్శకుడు వేణు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వంటి ప్రముఖుల నుండి ఆర్థిక సహాయం అందుకున్నప్పటికీ, మొగిలయ్య ఆరోగ్యం ఇటీవలి రోజుల్లో బాగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.మొగిలయ్య దంపతులను పొన్నం సత్తయ్య అవార్డుతో సత్కరించిన అనంతరం వారికి ఇల్లు కట్టిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల హామీ ఇచ్చారు.
మొగిలయ్య మృతితో ఆయన స్వగ్రామమైన దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బలగం దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. Folk Artist Mogilaiah of ‘Balagam’ Fame Passes Away , Folk Artist Mogilaiah, Balagam, Mogilaiah Passes Away