Gangavva : గంగ‌వ్వ మాట‌తో ఆమె ఊరికి క‌దిలి వ‌చ్చిన బ‌స్సు.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gangavva : గంగ‌వ్వ మాట‌తో ఆమె ఊరికి క‌దిలి వ‌చ్చిన బ‌స్సు.. !

 Authored By sandeep | The Telugu News | Updated on :25 April 2022,4:30 pm

Gangavva : బుల్లితెర‌, వెండితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు గంగవ్వ‌. మై విలేజ్ షోతో పాపులారిటీ ద‌క్కించుకున్న గంగ‌వ్వ ఆ త‌ర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి నానా ర‌చ్చ చేసింది. బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా అందర్నీ ఆకట్టుకున్న గంగవ్వ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేసింది. వచ్చే ముందు తనకు ఓ ఇల్లు కావాలనే చిరకాల కోరికను హోస్ట్ నాగార్జున ముందు ఉంచింది. గంగవ్వ కొత్తింటి నిర్మాణానికి మొత్తం రూ.20 లక్షలకుపైగా ఖర్చయ్యింది. డీఎన్‌కే కన్ స్ట్రక్షన్స్ వాళ్లు ఈ భవనాన్ని విలాసవంతంగానే నిర్మించారు.

రెండు బెడ్రూంలు, ఓ హాల్, కిచెన్, పూజ గది, మూడు బాత్రూంలు.. చుట్టూ ప్రహరీతో ఇంటిని నిర్మించారు. తన పాత ఇంటి రేకులతో.. ఓ ఎడ్ల కొట్టాన్ని నిర్మించినట్లు గంగవ్వ తెలిపింది. నాగార్జున నుంచి చెక్కుతోపాటు బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కూడా వచ్చిందని గంగవ్వ చెప్పింది.గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం కాగా, క‌రోనా స‌మయంలో ఈ గ్రామానికి బ‌స్సు స‌ర్వీసు నిలిపేశారు. కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్‌ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది.

gangavva initiative bus service lambadipally

gangavva initiative bus service lambadipally

Gangavva : గంగవ్వ‌నా, మ‌జాకానా..!

తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ సహాయం కోరారు.లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావ‌డం కోసం గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. బస్సు గంగ‌వ్వ వ‌ల‌న తిరిగి రావ‌డంతో అంద‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసిన గంగవ్వ బృందంలో ‘మై విలేజ్‌ షో’ టీం నటులు అనిల్‌, అంజి మామ తదితరులు ఉన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది