Getup Srinu : క‌ష్టాల్లో గెట‌ప్ శ్రీను.. అండ‌గా నిల‌వ‌ని సుడిగాలి సుధీర్.. ఫ్రెండ్స్ ఇలానే ఉంటారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Getup Srinu : క‌ష్టాల్లో గెట‌ప్ శ్రీను.. అండ‌గా నిల‌వ‌ని సుడిగాలి సుధీర్.. ఫ్రెండ్స్ ఇలానే ఉంటారా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 November 2022,3:40 pm

Getup Srinu : తెలుగు బుల్లితెర మీద టాప్ లో ఉన్న కామెడీ షోలలో ఎక్స్ ట్రా జబర్దస్త్ ఒకటి అని త‌ప్ప‌క చెప్పీలి.. జబర్దస్త్ నుంచి పుట్టుకొచ్చిన ఎక్స్ ట్రా జబర్దస్త్ నుండి కూడా చాలా మంది కమెడీయ‌న్స్ పుట్టుకొచ్చారు. వారిలో సుడిగాలి సుధీర్, గెట‌ప్ శీను, రామ్ ప్ర‌సాద్ వంటివారు ఉన్నారు. ఈ ముగ్గురికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షోలో చాలామంది పంచులు వేసి నవ్విస్తే గెటప్ శీను మాత్రం తన గెటప్ తోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అల‌రిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను బుల్లితెర కమలహాసన్ అన్న పేరు కూడా పొందాడు.

ప‌లు కార‌ణాల వ‌ల‌న గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. గెటప్ శీను చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలు ఉండగా, ఆ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉండటంవల్ల శీను బుల్లితెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల గాడ్ ఫాద‌ర్ చిత్రంలోను క‌నిపించి మెప్పించాడు. అయితే రీసెంట్‌గా గెట‌ప్ శీను కొన్ని కామెంట్స్ చేసి లేని పోని చిక్కుల్లో ప‌డ్డాడు. హనుమాన్ టీజర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ను ఓ రేంజ్ లో పొగిడేశారు. ఇండస్ట్రీకి మరో రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తేయ‌డంతో జ‌క్కన్న ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. రాజ‌మౌళి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు.

Getup Srinu difficulties NO stood by Sudigali Sudheer

Getup Srinu difficulties NO stood by Sudigali Sudheer

Getup Srinu : ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే..!

అలాంటి అత‌నిని ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో పోల్చ‌డ‌మా? ప్రశాంత్ వర్మ గొప్ప డైరెక్టర్ కాదనడం లేదు. కానీ రాజమౌళితో కంపేర్ చేసే అంత గొప్ప డైరెక్టర్ కాదు కదా.. అంటూ గెట‌ప్ శీనుని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ఈ స‌మ‌యంలో గెట‌ప్ శీను ఫ్రెండ్స్ అయిన‌టువంటి సుడిగాలి సుధీర్ , రాంప్రసాద్ స‌పోర్ట్‌గా నిలవ‌క‌పోవ‌డంతో వారిని కొంద‌రు ట్రోల్స్ చేస్తున్నారు. గెట‌ప్ శీను ఏదో పొర‌పాటున అన్నాడు అని, రాజ‌మౌళిని త‌క్కువ చేసే ఉద్దేశం ఆయ‌న‌కు లేద‌ని చెప్పాలి క‌దా. మీరు అస‌లు ఆయ‌న ఫ్రెండ్సేనా అని సుధీర్, రామ్ ప్ర‌సాద్‌ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది