sudheer : సుధీర్‌ను ఆడుకున్న ఆది.. పగలబడి నవ్విన గెటప్ శ్రీను భార్య..!
sudheer : ఆది మాట్లాడితే చాలు పంచులు వర్షం కొనసాగుతుంది. జబర్దస్త్ స్టేజి మీద అతడు చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇతరులకు చాన్స్ ఇవ్వకుండా మొత్తం కౌంటర్స్ అన్ని అతడే వేస్తుంటాడు. ఆది తన స్కిట్స్‌లో గెస్ట్ రోల్స్ చేసేవారిని కూడా వదలుడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కూడా అదిరిపోయే పంచులు వేస్తాడు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటాడు. ఢీలో అయితే వీరిద్దరి మధ్య వచ్చే కామెడీని జనాలు ఇష్టపడుతుంటారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆది సుధీర్ యాంకరింగ్‌పై కౌంటర్స్ వేస్తుంటాడు.

getup srinu wife laughs for hyper aadi punches on sudheer
అయితే ఈ కామెడీని సుధీర్ లైట్ తీసుకున్న.. కొన్ని సందర్భాల్లో అతడి అభిమానులు మాత్రం ఆది హద్దులు దాటుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ఓ స్కిట్‌లో వాచ్‌మెన్ గెటప్ వేసిన ఆది.. నేను చాలా అపార్ట్‌మెంట్‌లలో వాచ్‌మెన్‌గా చేశా.. నిన్ను ప్రతి అపార్ట్‌మెంట్‌లో చూశా అని సుధీర్‌తో అంటాడు. అప్పుడు సుధీర్ నన్ను చూడమేమిటయ్యా బాబు అని అంటాడు. అందుకు ఆది తన దగ్గర ప్రూఫ్‌లు కూడా ఉన్నాయని.. కొన్ని సీడీలు తీసుకొస్తాడు. సీసీటీవీ ఫుటేజ్‌లు అని సుధీర్‌కు అందజేస్తాడు.
sudheer : సుధీర్‌ను ఆడుకున్న ఆది..

getup srinu wife laughs for hyper aadi punches on sudheer
దీంతో అక్కడున్న వారంతా ఫుల్‌గా నవ్వేస్తారు. గెటప్ శ్రీను భార్య సుజాత ఫుల్‌గా నవ్వేస్తోంది. జడ్జ్ సీట్లలో కూర్చొన్న ఇంద్రజ, ఉదయ భాను కూడా తెగ నవ్వేశారు. అయితే గెటప్ శ్రీను భార్య.. సుధీర్ ఫ్రెండ్ అనే సంగతి తెలిసిందే.అందుకే సుధీర్ మీద పంచ్‌లను బాగా ఎంజాయ్ చేసిన ఆమె పగలబడి నవ్వేసింది. మొత్తానికి సుధీర్, ఇది కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్.
