Samantha : సమంతకు తన గతాన్ని మర్చిపోయే శుభవార్త అంటే ఇదే కదా..!
Samantha: సమంత ఎప్పుడైతే చైతూ నుంచి విడాకులు తీసుకుందో అప్పటి నుంచి పెద్దగా సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. తన భర్త జ్ఞాపకాలను మర్చిపోయేందుకు సామ్ ఎంతగానో ట్రై చేసిందని అవన్నీ వర్కౌట్ కాలేదని తెలిసింది. దీంతో కొంతకాలం ప్రశాంతంగా ఉండేందుకు దేశంలోని వివిధ ఆలయాలకు వెళ్లి పూజలు చేసింది. తిరిగొచ్చాక వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారిపోయింది. ఇలా చేయడం ద్వారా పాస్ట్‌ను గుర్తుచేసుకోకుండా ఉండేందుకు మంచి అవకాశం అని భావించిందట.. ప్రస్తుతం సామ్ చేతి నిండా ఫుల్ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, బాలీవుడ్, వెబ్ సిరీస్ తో పాటు హాలీవుడ్ ఆఫర్ కూడా సమంత వద్ద ఉన్నాయి.
ఇటీవలే సమంత గుణశేకర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులోని యశోద క్యారెక్టర్‌కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇకపోతే సామ్ ఇండస్ట్రీలోనే చాలా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ చేస్తూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సామ్.ఈ మధ్య కాలంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.

good news for samantha to forget her past
Samantha : సమంతకు ఇంత కంటే ఏం కావాలి
పుష్ప సినిమా విజయంలో ఈ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది. ఫస్ట్ టైం సామ్ ఐటం గర్ల్‌గా మారి బన్నీతో స్టెప్పులేసింది. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ.. అనే స్పెషల్ సాంగ్ తాజాగా యూట్యూబ్‌లో రిలీజ్ అవ్వగా మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఆ పాటలో సమంత తన ఎద అంద చందాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. లిరిక్స్ అండ్ మాస్ బీట్స్ కూడా ఈ పాటకు ప్రాణం పోశాయని చెప్పవచ్చు. మత్తెక్కించే చూపులతో సామ్ వేసిన స్టెప్పులు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది. సామ్ చేసిన సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు ఇంతకన్నా ఆనందం ఏముంటుందని నెటిజన్లు అంటున్నారు.