Mahesh Babu : సర్కారువారి పాట మూవీ వాయిదా పడుతోందా.. ఆ హీరో పోటీకి వస్తున్నాడంట..
Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu కు ఉన్న క్రేజ్ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ లో లెక్కలు మారిపోతాయి. మొదటి నుంచి ఆయన సినిమాల పరంగా రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాంటే ఓ ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. అలాంటి మహేశ్ బాబుకు ఇప్పడు కొన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే కొన్ని సినిమాలు తప్పుకునేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సినిమానే తప్పుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ప్రభావం ఆయన సినిమా మీద బాగానే పడుతోంది.
మహేశ్ ఎంతో ఇష్టంగా చేస్తున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎండింగ్ కు వచ్చేసింది. ముందుగా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు జనవరి 13న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అనుకోకుండా భారీ మూవీ RRR పోటీకి దిగడంతోమహేశ్ బాబు వెనక్కు తప్పుకున్నారు. తన సినిమాను అదే ఏడాది ఏప్రిల్ 1కి వాయిదా వేసేశారు. ఈ వార్త మహేష్ ఫ్యాన్స్ కు ఒకింత నిరాశను కలిగించిందనే చెప్పొచ్చు. కానీ పరిస్థితుల కారణంగా తప్పుకుంటున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ డేట్ ను కూడా మార్చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Mahesh Babu : లైగర్ తో పోటీ తప్పదా..
ఎందుకంటే ఏప్రిల్ 1న రిలీజ్ అయ్యే సర్కారివారి పాట సినిమాకు పెద్ద పోటీ వచ్చి పడింది. రౌడీ హీరో విజయ్ లైగర్ పంజా విసిరేందుకు రెడీ అవుతున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న లైగర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది. లైగర్‌ను కూడా ఏప్రిల్ 1వ తేదీనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారంట. బాక్సాఫీస్ దగ్గర సర్కారి వారి పాటకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. మరి మహేశ్ సినిమాకు పోటీగా కాకుండా లైగర్‌ను ఒక వారం అటు ఇటుగా వాయిదా వేసుకోమని కోరుతారా లేదా అదే డేట్‌కు దిగుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మహేశ్ కు జోడీ కీర్తి సురేష్ నటిస్తోంది.