Guppedantha Manasu 14 Dec Today Episode : వసుధారను ప్రాజెక్ట్ హెడ్ గా గెలిపించిన దేవయాని.. మహీంద్రా, వసుధార షాక్.. దేవయాని అసలు ప్లాన్ రిషికి తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 14 Dec Today Episode : వసుధారను ప్రాజెక్ట్ హెడ్ గా గెలిపించిన దేవయాని.. మహీంద్రా, వసుధార షాక్.. దేవయాని అసలు ప్లాన్ రిషికి తెలుస్తుందా?

Guppedantha Manasu 14 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 633 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారను ప్రాజెక్ట్ హెడ్ గా ఉంచాలా వద్దా అనే విషయంపై రిషి ప్రత్యక్ష ఓటింగ్ నిర్వహిస్తాడు. దీంతో బోర్డ్ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఓటేస్తుంటారు. ఫణీంద్రా, మహీంద్రా, ఒక బోర్డ్ డైరెక్టర్ వసుధారకు సపోర్ట్ గా ఓటు వేస్తారు కానీ.. […]

 Authored By gatla | The Telugu News | Updated on :14 December 2022,9:00 am

Guppedantha Manasu 14 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 633 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారను ప్రాజెక్ట్ హెడ్ గా ఉంచాలా వద్దా అనే విషయంపై రిషి ప్రత్యక్ష ఓటింగ్ నిర్వహిస్తాడు. దీంతో బోర్డ్ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఓటేస్తుంటారు. ఫణీంద్రా, మహీంద్రా, ఒక బోర్డ్ డైరెక్టర్ వసుధారకు సపోర్ట్ గా ఓటు వేస్తారు కానీ.. లేడీ లెక్చరర్స్ ముగ్గురు మాత్రం వసుధారకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. జగతికి కూడా ఓటు ఉండటంతో తనకు వీడియో కాల్ చేస్తాడు మహీంద్రా. జగతి.. ఇక్కడ వసుధార ప్రాజెక్ట్ హెడ్ గా ఉండాలని ఓటు వేస్తున్నారు. నీ ఓటు ఎటు అని అడుగుతాడు. దీంతో నా ఓటు వసుధార ప్రాజెక్ట్ హెడ్ గా ఉండాలని అంటుంది జగతి. దీంతో ఆమె తరుపున మహీంద్రా ఓటు వేస్తాడు.

guppedantha manasu 14 december 2022 full episode

guppedantha manasu 14 december 2022 full episode

వసుధారకు అనుకూలంగా ఒక ఓటు, వ్యతిరేకంగా ఒక ఓటు పోలవుతూ ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియను మొత్తం రికార్డు చేస్తుంటారు. కొందరు లేడీ లెక్చరర్లు, కొందరు జెంట్స్ లెక్చరర్లు వసుధారకు వ్యతిరేకంగా ఓటు వేస్తుంటారు. వసుధారకు వ్యతిరేకంగా ఐదు ఉండగా, వసుధారకు అనుకూలంగా ఆరు ఉంటాయి. ఆ సమయంలో రిషి ఓటేస్తాడు. దీంతో వసుధారకు అనుకూలంగా 6, వసుధారకు వ్యతిరేకంగా 6 పోలవుతాయి. మొత్తం 12 ఓట్లు పోలవుతాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. టై అయితే ఏం చేయాలో మన మినిస్టర్ గారిని అడగాలేమో. ఏమంటావు రిషి. మినిస్టర్ గారికి ఫోన్ చేయి అంటాడు ఫణీంద్రా. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని.. అక్కర్లేదు అని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

ఏవండి.. నేను కూడా బోర్డు మెంబర్ నే. నాకూ ఓటు హక్కు ఉంది అని అంటుంది దేవయాని. దీంతో సరే.. వెళ్లి వేయి అంటాడు ఫణీంద్రా. ఇంతలో దేవయాని రిషి దగ్గరికి వెళ్లి రిషి టెన్షన్ పడకు అంటుంది. మార్కర్ తీసుకొని అందరినీ కాసేపు టెన్షన్ పెట్టి వసుధారకు అనుకూలంగా ఓటు వేస్తుంది దేవయాని.

దీంతో వసుధార గెలిచింది అంటూ లేచి చప్పట్లు కొడతాడు రిషి. దీంతో వసుధార, మహీంద్రా షాక్ అవుతారు. అందరూ చప్పట్లు కొడతారు. థాంక్యూ పెద్దమ్మ అంటాడు రిషి. వసుధారకు కంగ్రాట్స్ చెబుతాడు రిషి. పెద్దమ్మ.. మీరు సూపర్ అంటాడు రిషి.

టైమ్ కు వచ్చి వసుధారను గెలిపించారు అంటాడు రిషి. చూశావా వసుధార పెద్దమ్మ మనసేంటో అని అంటాడు రిషి. వసుధార కంగ్రాచ్యులేషన్స్ అని అందరూ చెబుతారు. నాన్నా రిషి కంగ్రాట్స్ చెప్పి వస్తాను అని వసుధార దగ్గరికి వెళ్తుంది దేవయాని.

కంగ్రాట్స్ వసుధార అని తనకు షేక్ హ్యాండ్ ఇస్తుంది దేవయాని. ఏంటి వసుధార.. ఏం జరిగిందో అర్థం కాలేదా అని అంటుంది దేవయాని. అదే మరి దేవయాని అంటే. ముందు ముందు నీకు బాగా అర్థం అవుతుంది అని చెప్పి.. అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది దేవయాని.

Guppedantha Manasu 14 Dec Today Episode : నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటా అని వసుధారకు చెప్పిన రిషి

అందరికీ నమస్కారం.. ఈ రోజు వసుధార మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈసందర్భంగా వసుధార తరుపున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ అక్కడ ఎవ్వరూ లేకున్నా చప్పట్లు కొడతాడు రిషి. దీంతో ఇక్కడ ఎవ్వరూ లేరు సార్ అంటుంది వసుధార.

ఎవ్వరూ లేకున్నా ఉన్నట్టు ఊహించుకున్నా. అసలు నీకు అభినందన సభ పెట్టాలని ఉంది నాకు అంటాడు రిషి. దీంతో వద్దు సార్.. అసలు నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ ఏంటి అని అంటుంది వసుధార. ఆల్ ది బెస్ట్ వసుధార. జగతి మేడమ్ లా సమర్థవంతంగా ప్రాజెక్ట్ ను ముందుకు నడుపు అంటాడు రిషి.

దీంతో థాంక్స్ అంటుంది వసుధార. దీంతో ఉట్టి థాంక్సేనా. సెలబ్రేషన్స్ లేవా అంటాడు. దీంతో నేనేం పార్టీ ఇవ్వగలను అంటుంది వసుధార. దీంతో ఆలోచించు అంటాడు రిషి. దీంతో సార్ ఈ చాకొలేట్ ఒక్కటే ఉంది అని బ్యాగులో నుంచి తీసి ఇస్తుంది.

దీంతో కాకి ఎంగిలి చేసి తనకు ఇస్తాడు చాకొలేట్. ఆ తర్వాత రిషి చేయిని పట్టుకుంటుంది. మనం ఎప్పుడో రిషిధార అయ్యాం కదా అంటాడు రిషి. నేనెప్పుడూ నీకు తోడుగానే ఉంటాను వసుధార అని చెప్పి తన చేతులు పట్టుకుంటాడు రిషి. మరోవైపు లెక్చరర్లతో మాట్లాడుతుంది దేవయాని.

ఏంటి మేడమ్ అలా చేశారు అని అడుగుతారు. వసుధారను ఓడించాలని మీరే ఉసిగొల్పి.. తీరా మీరొచ్చి వసుధారకు ఓటేసి తనను గెలిపించడం ఏంటి మేడమ్ అని అడుగుతారు. దీంతో మీకు ఎత్తుగడలు తెలియవు. ఇక్కడ గెలిచింది వసుధార కాదు నేను అంటుంది దేవయాని.

రిషికి అన్నీ నేనే. రిషి వసుధారకు ఆ పొజిషన్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి నేను రిషి కోసం ఏదైనా చేస్తాను అని నమ్మించాను.. అంటుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది