Guppedantha Manasu 17 Jan Today Episode : ఎండీ పదవికి రాజీనామా చేసి కాలేజీ వదిలి వెళ్లిపోయిన రిషి.. ఇంతలో కాలేజీకి వచ్చిన వసుకు షాకిచ్చిన రిషి
Guppedantha Manasu 17 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 జనవరి 2023, మంగళవారం ఎపిసోడ్ 662 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు వెళ్లి ఈ డాడ్ ను ఒంటరి వాడిని చేస్తావా అని మహీంద్రా రిషిని పట్టుకొని బాధపడతాడు. దీంతో అందరూ ఉన్నా నేను ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను. నేను వెళ్తాను. నన్ను వెళ్లనివ్వండి అని చెప్తాడు రిషి. ఇంతలో జగతి.. రిషి అంటూ పిలుస్తుంది. ఒక్క మాట చెప్పనా? నువ్వు వెళ్లు. వద్దనే అధికారం నాకు లేదు. కానీ.. నువ్వు వెళ్తున్నట్టు నువ్వే ఒక మాట కాలేజీలో చెప్పి వెళ్లు అంటుంది జగతి. ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే ఈ ఇంట్లో వాళ్లు నీ గురించి ఏం చెప్పినా కాలేజీ వాళ్లు, బయటివాళ్లు నమ్మరు. వాళ్లకు తోచిన ఊహాగానాలు వాళ్లే ఊహించుకుంటారు. కాలేజీలో ఇది తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది. కాలేజీ గౌరవానికి భంగం కలుగుతుంది అంటుంది జగతి.
దీంతో రిషి.. జగతి చెప్పింది నిజం. కాలేజీలో ఒక మీటింగ్ పెడదాం. వాళ్లకు కూడా ఇదే చెప్పు. అప్పుడు వాళ్లు ఏం మాట్లాడటానికి ఉండదు. ఒక క్లారిటీ వస్తుంది. పెదనాన్నగా చెబుతున్నాను విను. జగతి మంచి ఆలోచనే చేసింది. కాలేజీలో చెప్పాకే వెళ్లు అని అంటాడు ఫణీంద్రా. దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. బ్యాగు అక్కడే వదిలేసి తన రూమ్ లోకి వెళ్లిపోతాడు రిషి. వెంటనే రెడీ అయి కాలేజీకి వస్తాడు. కాలేజీకి రాగానే మళ్లీ వసుధార తనకు గుర్తొస్తుంది. కాలేజీకి ఇద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ వచ్చేవారు. రిషి ఒక్కడే తన మెమోరీస్ తో కాలేజీకి వచ్చాడు అని అనుకుంటుంది జగతి. మహీంద్రా, జగతి, రిషి కారులో కాలేజీకి వస్తారు. వసుధారతో కలిసి తిరిగిన మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రిషి. దీంతో మహీంద్రా, జగతి ఇద్దరూ అతడిని డిస్టర్బ్ చేయరు.
మెమోరీస్ పరిమళం ఉన్న ప్రతి చోటుకు తను వెళ్తాడు మహీంద్రా. వెళ్లనివ్వు. పదా.. లోపలికి వెళ్దాం అని అంటుంది జగతి. నీ గాయం త్వరగా మానిపోవాలని కోరుకుంటున్నాను రిషి అని ఫణీంద్రా అనుకుంటాడు. ఇన్ని మెమోరీస్ నాకు అందించి నన్ను మరింత శిక్షిస్తున్నావు. కానీ.. నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావో.. నేను చేసిన తప్పేంటో తెలుసుకునే అవకాశం నాకు ఇవ్వలేదు అని అనుకుంటాడు రిషి.
ఇంతలో మహీంద్రా ఫోన్ చేసి అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా రా అంటాడు. దీంతో కాలేజీ లెక్చరర్లు అందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు రిషి. రిషి సార్ డల్ గా కనిపిస్తున్నాడు ఏంటి అని అనుకుంటారు. ఇంత అర్జెంట్ గా మీటింగ్ కు పిలవడానికి కారణం.. పెద్దగా ఏం లేదు అంటాడు.
డీబీఎస్టీ కాలేజీ అంటేనే అందరికీ గౌరవం ఉంది. ఆ గౌరవానికి అందరూ సహకారం అందించారు. ఇప్పుడు కూడా మీరు డీబీఎస్టీ కాలేజీ కొత్త ఎండీకి కూడా మీరు సహకరించాలి అంటాడు రిషి. దీంతో కొత్త ఎండీ వస్తే మరి మీరు అని అడుగుతారు లెక్చరర్స్.
దీంతో డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవికి నేను రాజీనామా చేస్తున్నా అంటాడు రిషి. ఎందుకు ఏంటి అని అడగొద్దు. అది నా పర్సనల్. నాకు విశ్రాంతి కావాలి.. అంటాడు. మా తాతయ్య గారి ఆశయం ఈ కాలేజీ. దాన్ని ఇక ముందు కూడా ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను.
Guppedantha Manasu 17 Jan Today Episode : కాలేజీలో మీటింగ్ పెట్టి అందరికీ చెప్పిన రిషి
ఈ కాలేజీ కొత్త ఎండీగా జగతి మేడమ్ ఉంటారు అని చెబుతాడు రిషి. సార్.. మీరు మళ్లీ రారా అని అడుగుతుంది ఒక లెక్చరర్. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. దీంతో చూడండి సార్.. తను ఎక్కడికీ వెళ్లడం లేదు. మళ్లీ వస్తారు. చెప్పారు కదా. తను అలసిపోయానని. చిన్న బ్రేక్ అంతే. అలసిపోయారు.. మళ్లీ వస్తారు అంటాడు మహీంద్రా.
దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రిషి ఖచ్చితంగా వెళ్లాలా.. ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకో అంటాడు ఫణీంద్రా. దీంతో రెండు మూడు రోజుల్లో తగ్గిపోయే నొప్పి కాదు ఇది అంటాడు రిషి. మన కాలేజీని వదిలేసి వెళ్తే ఎలా రిషి అంటాడు మహీంద్రా.
దీంతో డాడ్.. నన్ను నేనే వదిలేసుకున్నాను. నాలో నేను లేను. నాకు నేను ఎప్పుడో దూరం అయ్యాను. ఇప్పుడు కాలేజీకి దూరం అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. నేను లగేజ్ తెచ్చుకున్నాను. ఇట్నుంచి ఇటే ఎయిర్ పోర్ట్ కు వెళ్తాను అంటాడు రిషి. దీంతో జగతి, మహీంద్రా, ఫణీంద్రా షాక్ అవుతారు.
ఇంట్లో మీ పెద్దమ్మకు చెప్పకుండా వెళ్తావా రిషి.. అని అడుగుతాడు ఫణీంద్రా. దీంతో చెప్పి వెళ్దామంటే తను వెళ్లనివ్వదు. వదినకు కూడా చెప్పు. వాళ్లకు కోపం వచ్చినా.. బాధ వచ్చినా ఏం చేయలేని స్థితిలో ఉన్నాను అంటాడు రిషి. ఆ తర్వాత జగతి దగ్గరికి వచ్చి.. తన చేయి పట్టుకుంటాడు రిషి.
తన చేయి పట్టుకొని తీసుకెళ్లి డీబీఎస్టీ కాలేజీ ఎండీగా చైర్ లో కూర్చోబెడతాడు రిషి. మేడమ్ జాగ్రత్త, ఈ కాలేజీ కూడా అని చెప్పి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుంచి కారులో వెళ్లిపోతాడు రిషి. కట్ చేస్తే ఇంతలో వసుధార అప్పుడే కాలేజీకి వస్తూ ఉంటుంది. కాలేజీలో అడుగుపెడుతూ ఉంటుంది. అప్పుడే రిషి కారు గేట్ నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది.
రిషిని చూసి సార్ అంటుంది వసుధార. కానీ.. రిషి తనను చూసి కారు ఆపి.. మళ్లీ తను చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకొని మళ్లీ కారు స్టార్ట్ చేసి వెళ్లిపోతాడు. సార్ అన్నా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు రిషి. మరోవైపు జగతి వెళ్లి ఎండీ చైర్ లో కూర్చోవడానికి బాధపడుతుంది.
ఇలాంటి సమయంలో ఎండీగా బాధ్యత తీసుకోవడం బాధగా ఉంది మహీంద్రా అంటుంది జగతి. ఇంతలో వసుధార ఎండీ ఆఫీసు లోపలకి వస్తుంది. మేడమ్ అని పిలుస్తుంది. వసుధారను చూసి షాక్ అవుతారు మహీంద్రా, జగతి. తను బ్యాగు పట్టుకొని రావడం చూస్తారు.
నువ్వా అంటుంది. మళ్లీ ఎందుకొచ్చావు అని అడుగుతుంది జగతి. దీంతో అదేంటి మేడమ్ అలా అడుగుతున్నారు అని అంటుంది వసుధార. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా బాధ్యతలు తీసుకున్నాను కదా.. వర్క్ స్టార్ట్ చేయాలంటూ మినిస్టర్ గారి నుంచి మెయిల్ వచ్చింది అంటుంది.
ఎండీ గారు ఎక్కడికో బయటికి వెళ్లినట్టున్నారు. ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. దీంతో జగతి ఇప్పుడు కొత్త ఎండీ అంటాడు మహీంద్రా. దీంతో పాత ఎండీ గారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవచ్చా మేడమ్ అంటే.. మాకు కూడా చెప్పలేదు అంటుంది జగతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.