Guppedantha Manasu 26 Nov Today Episode : జగతిని దగ్గరుండి చూసుకున్న రిషి. రక్తం ఇచ్చి కాపాడిన రిషి.. అయినా జగతికి ప్రాణాపాయం తప్పుతుందా? ఇంతలో వసుధారకు షాక్

Authored By Varun G | The Telugu News | Published on: November 26, 2022, 9:00 am

Guppedantha Manasu 26 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 నవంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 618 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మేము నీ ఫ్లాట్ లో ఉన్నట్టు రిషికి ఎప్పుడూ తెలియనివ్వను. నీకు మాట రానివ్వను. నీ ఫ్రెండ్ షిప్ కు ఎలాంటి మాట రాకుండా నేను చూసుకుంటాను. రిషితో ఆ ప్రస్తావన నువ్వు కూడా తీసుకురాకు అంటాడు మహీంద్రా. దీంతో సరే అంకుల్.. మీకు ఏమైనా తీసుకురానా. టీ తాగుతారా అని అడుగుతాడు గౌతమ్. దీంతో అవేమీ వద్దు. జగతికి త్వరగా బాగు అయితే చాలు అంటాడు మహీంద్రా. అంకుల్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తాడు గౌతమ్. మిమ్మల్ని ఏదో నేను కలపాలని ప్రయత్నించడం ఏంటి మేడమ్. రక్తబంధాన్ని రక్తమే కలుపుతుంది. ఇంతకన్నా గొప్ప అనుబంధం ఏముంటుంది అని అనుకుంటుంది వసుధార.

guppedantha manasu 26 november 2022 full episode

guppedantha manasu 26 november 2022 full episode

మేడమ్ మీరు కాస్త బయటికి వెళ్తారా అని అంటుంది నర్స్. దీంతో బయటికి వెళ్లబోతుండగా.. డాడ్ కు చెప్పు మేడమ్ కు ఏం కాదని అని వసుధారతో చెబుతాడు. దీంతో సరే అంటుంది వసుధార. బయటికి వెళ్లేటప్పుడు జగతిని చూస్తుంది వసుధార. మీ అబ్బాయి నీకు రక్తం ఇస్తున్నాడు. మీకేం కాదు మేడమ్. మీరు త్వరగా కోలుకుంటారు. మీ అబ్బాయే మిమ్మల్ని కాపాడుకుంటున్నాడు. కొడుకుగా అది తన బాధ్యత కదా అంటుంది వసుధార. మరోవైపు మహీంద్రాకు టీ తీసుకొచ్చి ఇస్తాడు గౌతమ్. ఇంతలో వసుధార బయటికి వస్తుంది. సార్ అంటుంది. ఫణీంద్రా సార్ ఫోన్ చేశారు. మేడమ్ కండీషన్ గురించి అడిగారు. వస్తున్నాం అని చెప్పారు అంటుంది వసుధార. దేవయాని వదిన ఈ సమయంలో కూడా ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తుంది. తను ఏదైనా ఒక మాట అన్నా మీరు ఏం అనుకోకండి అంటాడు మహీంద్రా. అయినా రిషి నా కొడుకు. వదిన గారు ఏదో అంటే మీరెందుకు ఊరుకోవాలి. ఇంకెప్పుడూ రిషిని వదిలి వెళ్లను గౌతమ్ అంటుంది వసుధార.

రాఅమ్మ కూర్చో అంటాడు మహీంద్రా. థాంక్యూ వసుధార. మేము లేని సమయంలో రిషిని కంటికి రెప్పలా చూసుకున్నావట అంటాడు మహీంద్రా. దీంతో అతడు నా బాధ్యత అంటుంది. నీ గొప్పతనం నాకు తెలుసమ్మా. రిషి ఏమన్నాడు అంటాడు మహీంద్రా. దీంతో తల్లి రుణం తీర్చుకుంటున్నాడు సార్ అంటుంది వసుధార.

రిషి బ్లడ్ ఇచ్చిన తర్వాత తన బ్లడ్ ను జగతికి ఎక్కిస్తారు. జగతిని చూసి అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు రిషి. పాత విషయాలు అన్నీ గుర్తొస్తాయి రిషికి. ఇంతలో జగతి రిషి రిషి అంటూ కలవరిస్తూ ఉంటుంది. దీంతో సర్.. మేడమ్ ఈ ఒక్క పేరే కలవరిస్తున్నారు. మీరేనా రిషి అంటే. ఏమౌతారు మీరు తనకు అని అడుగుతుంది నర్స్.

Guppedantha Manasu 26 Nov Today Episode : రిషి చేయి పట్టుకున్న జగతి

దీంతో ఏం చెప్పాలో రిషికి అర్థం కాదు. ఒక్క నిమిషం చూసుకోండి సార్. ఇప్పుడే వస్తాను అని చెప్పి నర్స్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీకు ఏం కాదు మేడమ్.. మీకు ఏం కానివ్వను. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. డాడ్ కు మీరంటే ప్రాణం. మీరే ఆయనకు చిరునవ్వు అని అనుకుంటాడు రిషి.

మీరు బాగుండాలి. డాడ్ మీరు కలిసుండాలి. ఆనందంగా ఉండాలి అని అనుకుంటాడు రిషి. ఇదే నేను కోరుకునేది అని అనుకుంటాడు రిషి. ఇంతలో రిషి చేయి పట్టుకుంటుంది జగతి. దీంతో రిషి షాక్ అవుతాడు. ఇంతలో దాహం అని అంటుంది జగతి. దీంతో అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని జగతికి తాగిస్తాడు రిషి.

జగతిని జాగ్రత్తగా చూసుకుంటున్న రిషిని చూసి మహీంద్రా చాలా సంతోషిస్తాడు. వసుధార కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఫణీంద్రా, దేవయాని కూడా వస్తారు. ఏమైంది అని గౌతమ్ ను అడుగుతారు. దీంతో గౌతమ్.. ఐసీయూ దగ్గరికి వాళ్లను తీసుకెళ్తాడు.

మీరు ఎక్కడికి వెళ్లారు.. ఎందుకు వెళ్లారు నాకు అవసరం లేదు. మీరు వచ్చారు నాకు అది చాలు. ఇంకెప్పుడూ నన్ను వదిలేసి వెళ్లకండి. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను డాడ్ అంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp