Guppedantha Manasu 27 Dec Today Episode : రాజీవ్ ను రంగంలోకి దింపిన దేవయాని.. చక్రపాణి ఇంటికి వచ్చి రాజీవ్ ఏం చేస్తాడు? వసు ఏం చేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 27 Dec Today Episode : రాజీవ్ ను రంగంలోకి దింపిన దేవయాని.. చక్రపాణి ఇంటికి వచ్చి రాజీవ్ ఏం చేస్తాడు? వసు ఏం చేస్తుంది?

 Authored By gatla | The Telugu News | Updated on :27 December 2022,9:00 am

Guppedantha Manasu 27 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 644 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రా.. కొంచెం తిను అంటూ ఫుడ్ తీసుకొచ్చి వసుధరకు ఇస్తుంది. దీంతో వద్దు అమ్మ.. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అంటే.. నీకు నా చేతితో అన్నం తినిపించి ఎన్ని రోజులు అయింది. ఇదిగో రెండు ముద్దలు తిను అని తినిపిస్తుంది వసుధార తల్లి. దీంతో అన్నం తింటుంది. నాన్న కోపం ఎప్పుడు పోతుందమ్మా అని అడుగుతుంది వసుధార. దీంతో ఇన్నాళ్లకు ఇంటికి వచ్చావు కదా. ఆమాత్రం కోపం ఉంటుంది కదా అంటుంది తన తల్లి. ఎంత కాదనుకున్నా ఆయన నీ నాన్నే కదా. నిజానికి నాన్నకు నువ్వంటేనే ఇష్టం. నీ చిన్నప్పుడు నాన్న ఎక్కడికి వెళ్లినా నాన్న తనతోనే తీసుకెళ్లేవారు. నువ్వు నిద్ర పోయే దాక నీ పక్కనే ఉండేవారు అంటుంది.

guppedantha manasu 27 december 2022 full episode

guppedantha manasu 27 december 2022 full episode

నేను ఇప్పుడు ఏమన్నాను. రాజీవ్ బావతో పెళ్లి వద్దన్నాను. చదువుకుంటా అన్నాను. నేను గొప్పగా పాస్ అయ్యాను అంటే ఆ విషయాన్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్లిన విషయాన్నే తిడుతున్నారు అంటుంది వసుధార. ఇంతలో చక్రపాణి వచ్చి అన్నాన్ని లాగి పక్కన పెడతాడు. ఏంటి సుమిత్ర.. మొగుడి పరువు పోతే పోనీ అని అనుకుంటున్నావా? అది నా పరువు తీసిన శత్రువు అంటాడు. ఇంతలో వసుధార ఫోన్ మోగుతుంది. ఈరోజు ఇంటికి వచ్చిందని మురిసిపోతున్నావు కానీ.. ఏదో ఒక రోజు ఏదో ఒక పరువు తక్కువ పని చేసి వెళ్లిపోతుంది చూడు అంటాడు. ఇంతలో మరోసారి ఫోన్ వస్తుంది. సుమిత్ర తనేదో పని ఉండే వచ్చింది. ఆ పని అవగానే వెళ్లిపోతుంది. పిచ్చి వాళ్లలాగా మళ్లీ మనిద్దరమే మిగులుతాం.. అంటాడు.

తను వెళ్లగానే ఊళ్లో వాళ్లు మళ్లీ ఏమయ్యా చక్రపాణి నీ కూతురు వచ్చిందట.. మళ్లీ వెళ్లిపోయిందట అంటాడు. ఇలా రిపీటెడ్ గా ఫోన్లు వస్తుంటే ఫోన్ తీసి ఇంటికి వచ్చిందో లేదో.. వీడెవడో తెగ ఫోన్లు చేస్తూనే ఉన్నాడు అంటాడు.

ఏంది ఈ ఫోన్లు అంటూ ఫోన్ ను విసిరికొడతాడు. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. చక్రపాణి అక్కడి నుంచి వెళ్లిపోగానే.. వసుధార ఫోన్ ను చూస్తూ ఏడుస్తుంది. మరోవైపు జగతి.. వసుధారకు ఫోన్ చేస్తుంది. కానీ.. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.

దీంతో జగతికి ఏం చేయాలో అర్థం కాదు. మహీంద్రా.. వసు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని అడుగుతుంది జగతి. దీంతో స్వీచ్ ఆఫ్ వస్తే ఏంటి అని అంటాడు మహీంద్రా. దీంతో అక్కడ జరగరానిది ఏదైనా జరిగిందేమో అంటుంది జగతి.

Guppedantha Manasu 27 Dec Today Episode : రిషికి ఫోన్ చేసిన దేవయాని

దీంతో చాలా ఏళ్ల తర్వాత తను ఇప్పుడు ఇంటికి వెళ్లింది. తన ఫ్యామిలీ మెంబర్స్ తో సంతోషంగా ఉందేమో అంటాడు మహీంద్రా. దీంతో ఒకసారి రిషికి అయినా ఫోన్ చేసి అడుగుతావా అని అంటుంది జగతి.

దీంతో వాడు ఎప్పుడూ కాలేజీ, కాలేజీ అంటూ ఉండేవాడు. ఇప్పుడైనా ప్రశాంతంగా అక్కడ ఉండనివ్వు అని అంటాడు. మరోవైపు వసుధార ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు అని అనుకుంటాడు రిషి.

వసుధార నా దగ్గర ఏదైనా దాస్తుందా? అని అనుకుంటాడు. తర్వాత ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో దేవయాని ఫోన్ చేస్తుంది. వెంటనే ఫోన్ ఎత్తి.. హలో వసుధార అంటాడు.

దీంతో రిషి.. నేను దేవయానిని అంటుంది. దీంతో ఆ చెప్పు పెద్దమ్మ అంటాడు. భోం చేశావా అంటుంది. అక్కడ ఎలా ఉంది అని అడుగుతుంది. దీంతో నేను హోటల్ లో ఉన్నాను. ఇంకా భోం చేయలేదు అంటాడు.

వసు వాళ్ల ఇంట్లో ఏమైనా ఏర్పాట్లు చేశారా అని అడుగుతుంది. దీంతో లేదు పెద్దమ్మ. ఇంకా వాళ్ల ఇంటికి వెళ్లలేదు అంటాడు. దీంతో అవునా… ఇంకా వాళ్ల ఇంటికి వెళ్లలేదు అన్నమాట.. అని వెంటనే రాజీవ్ కు ఫోన్ చేసి నువ్వు ఇక రంగంలోకి దిగు అంటుంది.

మరోవైపు రిషి.. తను చదువుకున్న కాలేజీకి వెళ్లి అక్కడ కూర్చొంటాడు. వసుధార నా జీవితంలోకి రాకపోతే నా జీవితంలో చాలా కోల్పోయే వాడిని. నాకు ఏం లేకుండా పోయేది. వసుధార వచ్చి నాకు ఎన్నో మెమోరీస్ ను మిగిల్చింది అని అనుకుంటాడు.

ఇంతలో ఊడ్చే అతడు వచ్చి ఊడవాలి. లేవండి సార్ అంటాడు. ఆ తర్వాత వసుధార గురించి అతడిని అడిగినా తెలియదు అంటాడు అతడు. మరోవైపు తన తండ్రితో ఎలాగైనా మాట్లాడాలని తన తల్లితో చెబుతుంది.

మిమ్మల్ని తక్కువ చేసి ఎవరు మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను సమాధానం చెబుతాను అని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది