Guppedantha Manasu 28 Nov Today Episode : రిషి, మహీంద్రా, జగతి కలిసిపోవడం చూసి తట్టుకోలేకపోయిన దేవయాని.. జగతిని చంపేందుకు కుట్ర పన్నుతుందా? జగతికి ఏమౌతుంది?
Guppedantha Manasu 28 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 619 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, మహీంద్రా ఇద్దరూ కలిసిపోతారు. మీరు ఎక్కడికి వెళ్లారో నేను అడగను.. ఇప్పటి నుంచి మీరు నాతోనే ఉంటారు కదా అంటాడు రిషి. ఇంతలో దేవయాని, ఫణీంద్రా వస్తారు. ఇద్దరూ కలిసిపోవడాన్ని చూసి తండ్రీకొడుకులు కలిసిపోయారన్నమాట అని అనుకుంటుంది దేవయాని. ఫణీంద్రా వచ్చి ఎలా ఉంది అంటాడు. బాగానే ఉంది అంటాడు మహీంద్రా. మరోవైపు రక్తం ఎక్కించాక ఆమె పరిస్థితి మెరుగుపడింది అని డాక్టర్ చెబుతాడు. దీంతో ఇంటికి తీసుకెళ్తాం అంటారు. సరే అంటాడు డాక్టర్. మహీంద్రా.. రిషి నాకు బ్లడ్ ఇచ్చాడా అని ఆశ్చర్యపోతుంది జగతి.
మహీంద్రా.. నేను నమ్మలేకపోతున్నాను అంటుంది జగతి. నా కొడుకు తన రక్తం ఇచ్చాడా అంటుంది జగతి. మహీంద్రా.. ఇంతకన్నా ఈ జన్మకు ఇంకేం కావాలి మహీంద్రా అంటుంది జగతి. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని.. ఏంటి జగతి ఈ యాక్సిడెంట్ ను కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావన్నమాట అంటుంది. దీంతో మేడమ్ మలుచుకోవడం ఏంటి.. మంచిగా మాట్లాడండి అంటుంది వసుధార. మేడమ్ కు ఇప్పుడే స్పృహ వచ్చింది.. అది తెలుసా మీకు అని అంటుంది వసుధార. దీంతో ఆ తెలుసులే.. అంటుంది. ఇలాంటప్పుడు ఇలాగా మీరు మాట్లాడేది. ఇదేనా మీ పెద్దరికం. ఇదేనా మీ సంస్కారం అంటాడు మహీంద్రా.
దీంతో మహీంద్రా ఇది హాస్పిటల్.. అంటుంది జగతి. దీంతో తను ఏం మాట్లాడుతుందో చూశావు కదా అంటాడు మహీంద్రా. నేనేమన్నాను.. ఉన్నదే కదా అన్నది. ఏదో మాయ చేసి రిషితో రక్తం ఎక్కించుకోగానే రిషి మీ ఆధీనంలోకి వచ్చేసినట్టేనా అంటుంది దేవయాని.
దీంతో రిషి నా కొడుకు. జగతి కొడుకు. మీ పెత్తనాలకు, కుట్రలకు రోజులు చెల్లిపోయాయని గుర్తు పెట్టుకోండి. మీ మాటలు ఆలోచనలు ఇలాగే ఉంటే.. ఇక ఊరుకునేదే లేదు గుర్తుంచుకోండి.. అంటాడు మహీంద్రా. ఇంతలో ఫణీంద్రా, రిషి, గౌతమ్ అప్పుడే లోపలికి వస్తారు.
Guppedantha Manasu 28 Nov Today Episode : రిషి తనను తిట్టినట్టు కలకన్న గౌతమ్
దీంతో వసుధార.. జగతిని జాగ్రత్తగా చూసుకో అంటుంది దేవయాని. జగతి.. ఆరోగ్యం జాగ్రత్త. నీకేం కాదు అంటుంది దేవయాని. ఫణీంద్రా వచ్చి ఏం భయం లేదన్నారు. మనం ఇంటికి వెళ్లిపోదాం. నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు ఫణీంద్రా. దీంతో రిషి వైపు చూస్తుంది జగతి. తనను చూసి చాలా సంతోషిస్తుంది.
మరోవైపు హాస్పిటల్ క్యాంటిన్ కు వెళ్లి టిఫిన్ ఏముంది అని అడుగుతుంది వసుధార. ఇడ్లీ, వడ, దోశ ఉన్నాయి అంటుంది. దీంతో వేడి వేడిగా ఇవ్వండి అంటుంది వసుధార. ఇంతలో ఈ వసు ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు రిషి. దీంతో క్యాంటీన్ వైపు వస్తున్న రిషిని చూసి సార్ ఇక్కడ అంటుంది.
ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే.. మీకోసమే టిఫిన్ తీసుకుంటున్నాను అంటుంది వసుధార. ఇప్పుడు నాకు టిఫిన్ అవసరమా అంటాడు రిషి. తింటే కాస్త శక్తి వస్తుంది కదా అంటుంది వసుధార. మీరేం మాట్లాడొద్దు. తినండి అంటుంది వసుధార. ముందు కడుపు నింపుకోండి.. మహీంద్రా సార్, జగతి మేడమ్ ఇంటికి వస్తున్నారు కదా. ఈ సందర్భంలో అయినా మీరు టిఫిన్ తినాలి అంటుంది వసుధార.
పదండి.. అని చెప్పి రిషితో టిఫిన్ తినిపిస్తుంది వసుధార. తర్వాత ఈ యాక్సిడెంట్ ఏంటో.. నాకంతా కలలా అనిపిస్తోంది అంటాడు రిషి. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మేడమ్ ను, మహీంద్రా సార్ ను త్వరగా ఇంటికి తీసుకెళ్దాం అంటుంది వసుధార.
ఇంతలో దేవయాని మేడమ్ గారు రెండు సార్లు కాల్ చేశారు. బహుషా మిమ్మల్ని ఇంటికి రమ్మనడానికేమో అంటుంది వసుధార. దీంతో డాడ్ ను వదిలేసి ఎలా వెళ్తా అని అనుకుంటాడు. ఇంతలో రిషికి ఫోన్ వస్తుంది. వెంటనే కోపంతో నువ్వు లోపలికి వెళ్లు.. నేను వస్తాను అంటాడు రిషి.
గౌతమ్ దగ్గరికి వెళ్లి.. ఒరేయ్ నువ్వు అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా కదరా. నువ్వు నాకు అబద్ధం చెబుతావా? నువ్వు నన్ను మోసం చేస్తావా? ఇంకేం మాట్లాడకురా. డాడ్ కనిపించలేదని నేను అల్లాడిపోతుంటే నా ముందే ఉండి కూడా నువ్వు నాకు చెప్పలేదు కదూ అంటాడు.
నేను డాడ్ కోసం కలవరిస్తుంటే నువ్వు అన్నీ తెలిసి కూడా నా బాధను చూసి ఎంజాయ్ చేశావా? నా బాధ నీకు పట్టలేద. డాడ్ ను నీ దగ్గర పెట్టుకొని తమాషా చూశావా. నువ్వు ఒక మోసగాడివి. నువ్వు అసలు నా ఫ్రెండ్ వే కాదు. నీది అసలు ఫ్రెండ్ షిప్పే కాదు అంటాడు రిషి.
దీంతో నా మాట విను అన్నా కూడా వినడు రిషి.. అయితే ఇదంతా కల.. నిజం కాదు. గౌతమ్ భ్రమ ఇది. ఇంతలో రిషి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. దీంతో ఏం లేదు అంటాడు గౌతమ్. మరోవైపు జగతి, మహీంద్రా ఇద్దరూ మనసు విప్పుకొని మాట్లాడుకుంటారు. రిషి గురించే మాట్లాడుకుంటారు.
ప్రతి సారి మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలని ఏం లేదు. నువ్వు, రిషి నీరు చేప లాంటి వారు. నీటిని విడిచి చేప లేనట్టే.. నిన్ను విడిచి రిషి ఉండలేడు అని చెబుతుంది జగతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.