Guppedantha Manasu 31 Aug Today Episode : వసు, రిషి ప్రేమించుకుంటున్నారనే విషయం దేవయానికి తెలుస్తుందా? వాళ్లను విడదీయడానికి ఏం ప్లాన్ వేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 31 Aug Today Episode : వసు, రిషి ప్రేమించుకుంటున్నారనే విషయం దేవయానికి తెలుస్తుందా? వాళ్లను విడదీయడానికి ఏం ప్లాన్ వేస్తుంది?

Guppedantha Manasu 31 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 543 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి రోజు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షలు నీకే కాదు.. నాకు కూడా. నిన్ను నీ లక్ష్యం వైపు నడిపేందుకు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తా. నీ గెలుపులోనే నా గెలుపు కూడా ఉంది వసుధర.. అని తను ఎగ్జామ్ రాసే […]

 Authored By gatla | The Telugu News | Updated on :31 August 2022,9:30 am

Guppedantha Manasu 31 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 543 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి రోజు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షలు నీకే కాదు.. నాకు కూడా. నిన్ను నీ లక్ష్యం వైపు నడిపేందుకు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తా. నీ గెలుపులోనే నా గెలుపు కూడా ఉంది వసుధర.. అని తను ఎగ్జామ్ రాసే పరీక్ష హాల్ కు వస్తాడు రిషి. నీ నీడలా ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను. ఇదే రిషి వాగ్దానం అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. ఆ తర్వాత పరీక్ష అయిపోతుంది. రాత్రి అవుతుంది. వసుధర ఇప్పుడు ఏం చేస్తోంది. ఎన్ని మార్కులు స్కోర్ చేయబోతోంది. ఈ గ్రూప్ లో ఏం అడగలేను. ఒకసారి కాల్ చేద్దామా. మాట్లాడొద్దు అని షరతు పెట్టాను అనవసరంగా. ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటుండగా అప్పుడే గౌతమ్ వస్తాడు. ఏం మిత్రమా నీలో నువ్వే మాట్లాడుకోవాలా.. మాతో మాట్లాడొచ్చు కదా అంటాడు గౌతమ్.

guppedantha manasu 31 august 2022 full episode

guppedantha manasu 31 august 2022 full episode

దీంతో అది కాదురా అంటాడు రిషి. నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ మానసిక పరిస్థితిని నేను తెలుసుకోగలను అని ఫోన్ తీసి వసుకు ఫోన్ చేస్తాడు గౌతమ్. దీంతో ఈ సమయంలో గౌతమ్ సార్ కాల్ చేస్తున్నారు ఏంటి అని అనుకుంటుంది వసు. హలో సార్ అంటుంది. హలో వసుధర ఎలా ఉన్నావు అని అంటాడు. దీంతో బాగానే ఉన్నా సార్ అంటుంది వసు. ఎందుకు చేశావురా అని అంటాడు రిషి. తిన్నదో అడుగు అంటాడు. దీంతో వసుధర భోజనం అయిందా అని అడుగుతాడు. దీంతో తిన్నా అంటుంది వసు. ఎగ్జామ్ ఎలా రాశావు అని అడుగు అని అంటాడు రిషి. దీంతో ఎగ్జామ్ ఎలా రాశావు అని అడుగుతాడు. లాస్ట్ ప్రశ్నకు రెండు ఆన్సర్స్ ఉన్నాయి కదా అని అంటాడు గౌతమ్. దీంతో లాస్ట్ ప్రశ్నకు రెండు ఆన్సర్స్ ఉంటాయని నీకు ఎలా తెలుసు అంటుంది వసు. పక్కన ఎవరున్నారు అని అడుగుతుంది వసు. పక్కన రిషి సార్ ఉన్నాడని తెలిసి నేను బాగానే చదువుతున్నాను. ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి.. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుకోవాలి.. అని అంటుంది. దీంతో నీ ఫ్రెండ్ ఎవరు అని అంటాడు గౌతమ్. దీంతో చందమామ అంటుంది. ఆ తర్వాత ఫోన్ తీసుకుంటాడు రిషి. తను మాట్లాడుతుంటే వింటుంటాడు. బై సార్.. అందరికీ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వసు.

కట్ చేస్తే తెల్లవారుతుంది. రెండో పరీక్ష ప్రారంభం అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నా. రెండో పరీక్షను టెన్షన్ లేకుండా ప్లాన్ చేసుకొని రాయండి అని చెప్పి వసుధర దగ్గరికి వచ్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. రెండో రోజు పరీక్ష ముగుస్తుంది. మూడో రోజు పరీక్ష స్టార్ట్ అవుతుంది.

Guppedantha Manasu 31 Aug Today Episode : పరీక్షల సమయంలో వసుధరకు మానసిక స్థైర్యాన్ని అందించిన రిషి

పరీక్ష హాల్ లోకి వచ్చిన రిషి.. మేడమ్ అంతా ఓకే కదా అంటాడు రిషి. దీంతో ఓకే సార్ అంటుంది మేడమ్. ఆ తర్వాత పరీక్ష హాల్ చుట్టూ తిరుగుతాడు రిషి. కాసేపు తిరిగి ఆ రూమ్ లో నుంచి వెళ్లిపోతాడు. టైమ్ అయిపోయింది పేపర్స్ ఇచ్చేయండి అంటుంది మేడమ్.

అందరూ పేపర్స్ ఇచ్చి వెళ్లిపోతారు. నాలుగో రోజు పరీక్ష కూడా స్టార్ట్ అవుతుంది. అంతా ఓకే కదా జగతి అని మహీంద్రా అడుగుతాడు. దీంతో అంతా ఓకే సార్ అంటుంది జగతి. సరే రౌండ్స్ కు వెళ్లి వస్తాను అని వసుధర ఉన్న హాల్ లోకి వస్తాడు మహీంద్రా.

అదే సమయంలో రిషి అక్కడే ఉండటంతో నాకు తెలుసు రిషి నువ్వు ఈ హాల్ లోకి వస్తావని అని అనుకుంటాడు. ఆ తర్వాత పరీక్ష ముగుస్తుంది. ఐదో రోజు పరీక్ష కోసం కాలేజీకి వస్తారు. పరీక్ష అయిపోయాక.. పుష్ప, వసు ఇద్దరూ వెళ్తుండగా రిషి ఎదురు పడతాడు. ఎగ్జామ్ ఎలా రాశారు అని అడుగుతాడు.

దీంతో బాగానే రాశాం అంటారు. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మార్క్ చేసి పంపిస్తాను. వాటినే చదవండి అంటాడు. ఆ తర్వాత మహీంద్రా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది అని అడుగుతుంది. దీంతో రిషి గురించి అంటాడు. తన గురించి చెబుతుండగా ఇంతలో రిషి వస్తాడు.

మరోవైపు తన వదినను పిలుస్తాడు రిషి. పెద్దమ్మకు ఏం కావాలో చూడండి అని అడుగుతాడు రిషి. దీంతో నాకేం వద్దు. నాన్నా రిషి నీకు ఏమన్నా కావాలా అని అంటుంది. దీంతో చూశారా డాడ్. పెద్దమ్మ తన కోసం కాదు.. నాకోసం ఏం కావాలా అని ఆలోచిస్తుంటారు అంటాడు.

ఎగ్జామ్స్ అయిపోయాక అందరం వెళ్లిపోవాలి కదా.. అందరినీ వదిలి వెళ్లిపోవాలి కదా అంటుంది పుష్ప. ఇంతలో రిషి సార్ వస్తాడు. రిషి సార్ తో మాట్లాడకపోతే ఇంత బాధగా ఉంటుందా? ఒక్కసారి గలగలా మాట్లాడాలని ఉంది అని అనుకుంటుంది వసు.

వసుతో మాట్లాడితే బాగుండు. అనవసరంగా ఈ నిబంధన పెట్టానా అనుకుంటాడు. అందరూ పరీక్షలు ఎలా రాస్తున్నారు అని అడుగుతాడు రిషి. నేను బాగానే రాస్తున్నాను సార్ అంటుంది వసుధర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది