Guppedantha Manasu 8 Dec Today Episode : వన భోజనాల్లో సన్నిహితంగా ఉన్న వసుధార, రిషిపై బ్యాడ్ కామెంట్స్.. దీంతో రిషిని వదిలేసి వసుధార వెళ్లిపోతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 8 Dec Today Episode : వన భోజనాల్లో సన్నిహితంగా ఉన్న వసుధార, రిషిపై బ్యాడ్ కామెంట్స్.. దీంతో రిషిని వదిలేసి వసుధార వెళ్లిపోతుందా?

Guppedantha Manasu 8 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 628 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార తలలో గులాబి పువ్వు పెడతాడు. తర్వాత మీ గిఫ్ట్ కు థాంక్స్ అని చెప్పి వసుధార కిందికి వస్తుంది. చీరలో ఉన్న తనను చూసి దేవయాని షాక్ అవుతుంది. ఏం వసుధార.. ఏంటి కొత్తదా అని అడుగుతుంది దేవయాని. దీంతో […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 December 2022,9:00 am

Guppedantha Manasu 8 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 628 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార తలలో గులాబి పువ్వు పెడతాడు. తర్వాత మీ గిఫ్ట్ కు థాంక్స్ అని చెప్పి వసుధార కిందికి వస్తుంది. చీరలో ఉన్న తనను చూసి దేవయాని షాక్ అవుతుంది. ఏం వసుధార.. ఏంటి కొత్తదా అని అడుగుతుంది దేవయాని. దీంతో అవును మేడమ్ బాగుందా. రిషి సార్ తీసుకొచ్చారు. ఏమైనా రిషి సార్ సెలక్షనే సెలక్షన్ మేడమ్. ఈ కలర్ కాంబినేషన్ చూడండి. ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి. నాకైతే బాగా నచ్చింది మేడమ్. వెళ్లొస్తాను. ఈ వన భోజనాలకు మీరు రాలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను మేడమ్ అని చెప్పి రిషి హారన్ కొట్టడంతో వెళ్లొస్తాను బై అని చెప్పి బయటికి వెళ్తుంది వసుధార.

guppedantha manasu 8 december 2022 full episode

guppedantha manasu 8 december 2022 full episode

ఈ వసుధార రోజురోజుకూ ఎక్కువ చేస్తోంది. చెప్తాను దీని పని అని అనుకుంటుంది దేవయాని. వెంటనే కాలేజీలోని ఓ లెక్చరర్ కు ఫోన్ చేస్తుంది దేవయాని. నేను వనభోజనాలకు రావడం లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయి అని ఏదో చెబుతుంది దేవయాని. మళ్లీ ఏదో ప్లాన్ వేసింది. మరోవైపు వనభోజనాల కోసం అన్నీ రెడీ చేస్తుంటారు. ఇంతలో పుష్ప కూడా అక్కడికి వస్తుంది. మేడమ్ వసుధార ఎక్కడుంది మేడమ్ అని అడుగుతుంది. దీంతో రిషి సార్ ఎక్కడున్నారో తెలుసా? అని అడుగుతుంది. తెలియదు అంటుంది. దీంతో రిషి సార్ ఎక్కడుంటే వసుధార కూడా అక్కడే ఉంటుంది అని అంటుంది. దీంతో పుష్పకు ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు వసుధార.. వంటలు ఎలా అవుతున్నాయో చూస్తుంది. వంటలు బాగా రుచిగా చేయండి. మసాలా కాస్త తగ్గించండి అంటుంది. అందరికీ రుచికరమైన వంటలు వండండి అంటాడు రిషి వచ్చి. ఇంతలో వసుధార ఏం చేస్తుంది అని అనుకుంటాడు రిషి.

ఒక్క నిమిషం అని చెప్పి రిషి వంట వాడి డ్రెస్ వేసుకొని వసుధార దగ్గరికి వెళ్తాడు. వంట పనులు ఎలా సాగుతున్నాయమ్మా అని అడుగుతాడు. దీంతో బాగానే ఉన్నాయి అంటూ వెనక్కి తిరిగి రిషిని ఆ వేషంలో చూసి షాక్ అవుతుంది వసుధార.

సార్ అంటుంది. దీంతో సార్ కాదు. వంట మాస్టరును. చెప్పండి మేడమ్.. ఏ వంటలు చేయాలి అని అడుగుతాడు రిషి. దీంతో రిషి సార్ కు ఆలు ఫ్రై అంటే ఇష్టం. అందుకే ఆ వంట చేయండి అంటుంది వసుధార.

Guppedantha Manasu 8 Dec Today Episode : వసుధార గురించి తప్పుగా మాట్లాడుతుంటే విన్న గౌతమ్

దీంతో సరే అంటాడు రిషి. వంట మాస్టారు మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అంటుంది. దీంతో సరే తీసుకోవచ్చు అంటాడు రిషి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత వనభోజనాలకు రావడం చాలా సంతోషంగా ఉంది అంటుంది వసుధార.

లాస్ట్ టైమ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటుంది వసుధార. తర్వాత ముందు మీరు ఈ గెటప్ తీసేయండి సార్ అంటుంది వసుధార. ఆ తర్వాత వెనుక తన జాకెట్ ముడి ఊసిపోతుంది. దీంతో తనకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటాడు రిషి.

ఇప్పుడు ఏం చేయాలి.. మెసేజ్ పెడితే అంత బాగుండదేమో అని తన జాకెట్ ఊడిపోయిన వెనుక బాగాన్ని ఫోటో తీసి తనకు పంపిస్తాడు. దీంతో ఫోటో చూసి షాక్ అవుతుంది. వెంటనే చెట్టు చాటుకు వెళ్లి తన జాకెట్ ను ముడి వేసుకోబోతుండగా వచ్చిన రిషి ఆ ముడులు వేస్తాడు.

మీ శ్వాసను కూడా నేను గుర్తుపట్టగలను సార్. అయినా ఇంత ధైర్యం, అధికారం ఇంకెవరికి ఉంటుంది అని అనుకుంటుంది వసుధార. ఇంతలో దేవయాని ఫోన్ చేసిన లెక్చరర్ వీళ్లనే గమనిస్తూ ఉంటుంది.

ఇంతలో రండి మేడమ్ అని ఒక మేడమ్ ను తీసుకెళ్లి ఘోరాలు జరుగుతున్నాయి అంటూ రిషి.. వసుధార గురించి చెబుతుంది. అందుకే దేవయాని మేడమ్ వసుధార మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పింది అంటుంది.

అమాయకంగా కనిపించేవాళ్లే అంచనాలకు అందరు అంటుంది. చిన్నగా మేడమ్ వసుధార వస్తుంది అంటుంది. దీంతో వస్తే రానివ్వండి. నాకేం భయం. పరాయి మగాళ్లతో బ్లౌజ్ లేసులు కట్టించుకునే వాళ్ల గురించి నాకెందుకు భయం.

కాలం మారింది అంటే ఏమో అనుకున్నాం కానీ.. మారింది కాలం కాదు.. వాళ్ల బుద్ధులు అంటుంది. కనిపించిందే ఇది అయితే.. కనిపించకుండా ఇంకెన్ని ఉన్నాయో. ఈ తోటలో, పొదలో ఇంకెన్ని జరుగుతున్నాయో అంటుంది.

దీంతో వాళ్లను ఏం అనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. ఇంతలో గౌతమ్ వచ్చి ఏంటి మేడమ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు. ఇంతలో ధరణిని పిలిచి వదిన వీటిని తీసుకెళ్లి వాళ్లకు ఇవ్వండి అంటాడు.

మేడమ్.. మీరు వసుధారను అంటున్న మాటలన్నీ నేను విన్నాను. మీరు అన్నది తప్పు మేడమ్ అంటాడు గౌతమ్. దీంతో వాళ్లు చేసింది. నేను చూసింది చెప్పాను అంటుంది. దీంతో వాళ్లు చనువుగా ఉంటే తప్పేంటి అంటాడు గౌతమ్.

మీ ఇళ్లలో ఇలాంటివి జరగవా? అని అడుగుతాడు గౌతమ్. దీంతో మరీ అందరి ముందు ఇలా అంటుంది మేడమ్. దీంతో అందరు ఉన్నారు కాబట్టే.. వసుధార చాటుకు వెళ్లింది అంటాడు. ఈ విషయాన్ని నేను రిషికి ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా. వెంటనే వెళ్లి వసుధారకు సారీ చెప్పండి అంటాడు గౌతమ్.

ఒరేయ్ రిషి.. మినిస్టర్ వస్తున్నారంట అని వెళ్లి చెబుతాడు గౌతమ్. అవునా.. వసుధార ఏది అని అడుగుతాడు. దీంతో తను వస్తుంది కానీ మనం మినిస్టర్ ను రిసీవ్ చేసుకుందాం అంటాడు. ఇంతలో ధరణిని పిలిచి వసుధార ఎక్కడుంది రమ్మని చెప్పండి అంటాడు.

కానీ.. వసుధార ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది