Hara hara mahadev : ‘హర హర మహాదేవ్’ తో రాబోతున్న పవన్ కళ్యాణ్ ..?

Advertisement

Hara hara mahadev : ‘హర హర మహాదేవ్‘ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరీర్ లో 27 వ సినిమాగా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా వకీల్ సాబ్ ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

hara-hara-mahadev-pawan-kalyan-new-film-title
hara-hara-mahadev-pawan-kalyan-new-film-title

అయితే ఈ సినిమాకి ముందు నుంచి విరూపాక్ష అన్న టైటిల్ తో పాటు బందిపోటు అన్న టైటిల్స్ ని అనుకున్నారు. కాని అవన్ని పుకార్ల ని మళ్ళీ వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ‘హరి హర వీర మల్లు’ అన్న టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఈ టైటిల్ ఏవీ కాదని లేటెస్ట్ అప్‌డేట్. ఇటీవలే పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాకి ‘హర హర మహాదేవ్’ అన్న టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ మాత్రం అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇదే టైటిల్ గనక ఫిక్స్ అయితే మాత్రం ఇక క్రిష్ సినిమాలలో మరొక బ్లాక్ బస్టర్ అని మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Hara hara mahadev : పవన్ కళ్యాణ్ ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్స్..!

ఇక మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం సినిమా కూడా సెట్స్ మీద ఉంది. రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తున్నాడు. క్రిష్ సినిమాతో పాటు అయ్యప్పనుం కోషియం సినిమా కూడా సమాంతరంగా కంప్లీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్స్ పాల్గొంటూ టాకీపార్ట్ కంప్లీట్ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు.. స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

Advertisement
Advertisement