Hema : ‘ ఒక్కొక్కడి అంతు చూస్తా ‘ ఆ యూట్యూబ్ చానల్ మీద నటి హేమ పిచ్చ సీరియస్ !
Hema : ఇటీవల యూట్యూబ్ ద్వారా చాలా ఫేక్ న్యూస్ లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలపై అడ్డదిడ్డ అసభ్యకర వార్తలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా నటి హేమ ఇలాంటి వాటిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ సినీ సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారిని బజారుకు ఈడ్చాలా, వారికి ఫ్యామిలీస్ ఉండవా అడ్డదిడ్డంగా, అసభ్యకరంగా వారి గురించి తప్పుడు ప్రచారం చేస్తే వారు ఎంత ఇబ్బంది పడతారో మీరు చూస్తున్నారు. ఇటీవల కోట శ్రీనివాస్ రావు గారు మరణించారు అని పోస్ట్ లు పెట్టారు.
నేను బతికే ఉన్నానని వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పోస్ట్ లు పెట్టే వాళ్ళతో సమాజం చెడిపోతుంది అంటూ హేమ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తాను చిన్నప్పుడు ఓ పార్టీలో ఉన్నప్పటి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్ ఇంట్లో పెట్టారని, వీటిని ఇప్పటివరకు నా భర్త చూడలేదని, చూస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనే కాకుండా సినీ ఇండస్ట్రీలో చాలామంది ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా తయారు చేసి విడుదల చేస్తున్నారు అని అన్నారు. దీంతో వారు మానసికంగా కృంగిపోతున్నారు.
కొందరు నటీమణులు తమ భర్తతో కలిసి ఉన్న విడాకులు తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. వెబ్ మీడియాపై పోరాటం కొనసాగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో ఒకరు యూట్యూబ్ లో తన గురించి పోస్ట్ లు పెడితే కేసు పెట్టానన్నారు. అమెరికాలో ఉన్న ఆ యూట్యూబర్ ని పోలీసులు పట్టుకొని వచ్చి విచారణ చేశారు. ఇకపై ఇలాంటి పోస్ట్ లు పెడితే వారిపై పోరాటం చేస్తానని అన్నారు. ఇకనుంచి ఎవరి గురించైనా ఏ ఫ్యామిలీ గురించి అయినా అసభ్యకర పోస్టులు పెడితే అస్సలు ఊరుకునేది లేదని హెచ్చరించారు.