Hero Wifes : వామ్మో హీరోలే కాదు వారి భార్యలు కూడా అంత సంపాదిస్తున్నారా.. వారి ఆదాయం తెలిస్తే నోరెళ్లపెడతారు..
Hero Wifes : ఈ కాలం నాటి స్టార్ హీరోలు కోట్లలో సంపాదిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు మన హీరోల రేంజ్ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం అయి ఉండేది. ఇప్పుడు మాత్రం దేశ వ్యాప్తంగా పాకింది. మన హీరోల సినిమాలు సక్సెస్ కావడం, కోట్లలో కలెక్షన్స్ వస్తుండడంతో వారు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. ప్రభాస్ వంటి హీరోలు నలబై కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుండగా, హీరోల భార్యలు కూడా ఆ రేంజ్ లోనే సంపాదిస్తున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వ్యాపారాలు చూసుకుంటున్నారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. అల్లు అర్జున్ సతీమణి తన తండ్రి ప్రభాకర్ రెడ్డి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా స్నేహ రెడ్డి ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన బిజినెస్ లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. కోట్లాది రూపాయల అపోలో హాస్పటల్స్ వ్యాపారాన్ని ముందుకు నడిపించడంలో ఆమె కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలతో ఆరోగ్యకరమైన వంటకాలను వండిస్తు వాటిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు.
Hero Wifes సతీమణులు బాగానే సంపాదిస్తున్నారుగా..
ఇక రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి కూడా వ్యాపారాలు చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తన భార్య తనకంటే ఎక్కువ ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేస్తుందని తెలిపారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ భార్య కూడా వ్యాపార రంగంలో రాణిస్తుంది. ఎంబిబిఎస్ చదివిన కళ్యాణ్ రామ్ సతీమణి ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని నడుపుతున్నారు. కళ్యాణ్‌రామ్ సినిమాల వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా ఈ కంపెనీల్లోనే జరుగుతుంది. మంచు విష్ణు సతీమణి వెరోనిక కూడా పలు వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఓ క్లాతింగ్ కంపెనీకి ఆమె ఓనర్ గా ఉన్నారు. కుటుంబ పరంగా ఉన్న వ్యాపారాలు కూడా ఆమె చూసుకుంటున్నారు.