Virata Parvam : సోలో హీరోగా రానాకు హిట్ దక్కడం ఖాయమా..సాయి పల్లవి ఇమేక్ ఎంతవరకూ..?
Virata Parvam : నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత రానా దగ్గుబాటి నుంచి ఏకంగా హిస్టారికల్ సినిమా వస్తుందని అందరూ భావించారు. అగ్ర దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా తండ్రి సురేష్ బాబు, దర్శకుడు గుణశేఖర్ నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ కలిసి దాదాపు 120 కోట్ల రూపాయలతో నిర్మించడానికి పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నారు. కానీ, కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటికే కొంత బడ్జెట్ ఖర్చు చేసి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా మొదలుపెట్టిన మేకర్స్ రిక్స్ వద్దని హిరణ్య కశిప అనే టైటిల్‌తో అనుకున్న సినిమాను నిలిపివేశారు.
ఆ తర్వాత తేజ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా రూపొందుతుందని ప్రచారం జరిగింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాను మించి ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయని చెప్పుకున్నారు. దర్శకుడు తేజ కూడా ఈ సినిమా విషయంలో కన్‌ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ, ఎందుకనో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. రానా హీరోగా మరో కొత్త సినిమా కూడా ప్రకటన రాలేదు. ఎపుడో రెండేళ్ళ క్రితం మొదలైన విరాట పర్వం సినిమా కరోనా కారణంగా చిత్రీకరణ సజావుగా సాగలేదు ఫైనల్‌గా షూటింగ్ కంప్లీట్ అయిందనుకుంటే రిలీజ్‌కు మోక్షం కలగడం లేదు.
Virata Parvam: నేషనల్ అవార్డ్ విన్నర్స్ కీలక పాత్రల్లో ..
గత ఏడాది నారప్ప, దృశ్యం 2 సినిమాలను సురేష్ బాబు బృందం థియేటర్స్‌లో రిలీజ్ చేయకుండా ఓటీటీలోకి తీసుకువచ్చారు. అదే సమయంలో విరాట పర్వం కూడా ఓటీటీలో వస్తుందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర హైలెట్ అవుతుందని సినిమా సక్సెస్‌కు ఆమె సగం కారణం అవుతుందని తన ఇమేజ్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకువస్తుందని చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు కుదురుతుందో తెలీదు గానీ, రానాకు మాత్రం సోలో హీరోగా విరటా పర్వం సినిమా మంచి హిట్ ఇవ్వడం తప్పనిసరి. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్స్, నందిత దాస్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.