Jabardasth Rohini : రోహిణి కి ఎందుకు మల్లెమాల యొక్క బాండ్ వర్తించడం లేదు?
Jabardasth Rohini : జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లు అందరూ కూడా మల్లెమాల వారితో బాండ్ లో ఉంటారు.. అంటే బాండ్ లో ఉన్నవారు మల్లెమాల ని వదిలి వెళ్లాలి అంటే పది లక్షల రూపాయలు చెల్లించి వెళ్ళాలి. ఆ బాండ్ రెన్యువల్ చేయకుంటే పర్వాలేదు కానీ రెన్యువల్ చేస్తే మళ్ళీ సంవత్సరం పాటు మల్లెమాలతోనే కొనసాగాల్సి ఉంటుంది. గతంలో అవినాష్ బాండ్ బ్రేక్ చేసినందుకు గాను ఏకంగా 10 లక్షల రూపాయలు చెల్లించిన విషయం […]
Jabardasth Rohini : జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లు అందరూ కూడా మల్లెమాల వారితో బాండ్ లో ఉంటారు.. అంటే బాండ్ లో ఉన్నవారు మల్లెమాల ని వదిలి వెళ్లాలి అంటే పది లక్షల రూపాయలు చెల్లించి వెళ్ళాలి. ఆ బాండ్ రెన్యువల్ చేయకుంటే పర్వాలేదు కానీ రెన్యువల్ చేస్తే మళ్ళీ సంవత్సరం పాటు మల్లెమాలతోనే కొనసాగాల్సి ఉంటుంది. గతంలో అవినాష్ బాండ్ బ్రేక్ చేసినందుకు గాను ఏకంగా 10 లక్షల రూపాయలు చెల్లించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి బాండ్ గురించి తెగ చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ బాండ్ లో ఉంటారు.. ఆ విషయం అందరికీ తెలిసిందే. టీం లీడర్ ముఖ్యంగా బాండ్ పేపర్ లో సంతకం పెట్టాల్సిందే.
ఇప్పుడు జబర్దస్త్ లో రోహిణి ఒక టీం లీడర్.. అయినా కూడా ఆమెకు బాండ్ వర్తించడం లేదు ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారం అయ్యే పలు కార్యక్రమాలకు మరియు జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంది. సాధారణంగా ఒక జబర్దస్త్ కంటెస్టెంట్ బాండ్ లో ఉంటే ఇతర చానల్స్ లో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. మరి రోహిణి ఎందుకు పాల్గొంటుంది అంటూ ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. లేడీ అవ్వడం వల్ల ఆమెతో మల్లెమాలవారు ఒప్పందం రాయించుకోలేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం ఆమెకు చిన్నచిన్న మినహాయింపులు ఇచ్చి ఉంటారు అనేది టాక్.
రోహిణి ఆమధ్య ఈటీవీ మల్లెమాల నీ వదిలేసినట్లుగానే పుకార్ల షికార్లు చేశాయి. కానీ ఆమె ఇప్పటికి కూడా జబర్దస్త్ లో ఒక టీం కి లీడర్ గానే కొనసాగుతుంది. ముందు ముందు కూడా ఆమె టీం లీడర్ గానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఆమె వేరే చానల్స్ లో సందడి చేస్తూ కనిపిస్తుంది. బాండ్ విషయంలో రోహిణికి మల్లెమాల వారు ఎందుకు కండిషన్ పెట్టలేదు అంటూ కొందరు ప్రేక్షకులు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం లేడీస్ విషయంలో మల్లెమాల వారు చూసి చూడనట్లుగా ఉంటారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. రోహిణి మాదిరిగానే ఇతర కంటెస్టెంట్స్ కి కూడా ఇదే పద్ధతి కొనసాగితే అన్ని చానల్స్ లో వారు ఎంటర్టైన్మెంట్ అందించి.. తప్పకుండా జబర్దస్త్ లో కూడా మంచి వినోదాన్ని అందిస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది మల్లెమాల వారి పాలసీకి విరుద్ధం కనుక రోహిణికి తప్ప మరెవ్వరికీ బాండ్లు మినహాయింపులు ఉండవేమో.