Chiranjeevi – Balakrishna : చిరంజీవి, బాలకృష్ణలు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారు!
Chiranjeevi – Balakrishna : టాలీవుడ్ లో నిర్మాతలు ప్రస్తుతం నటీ నటుల పారితోషికాలు చాలా ఎక్కువ అయ్యాయి… సినిమా మేకింగ్ కూడా అత్యంత భారీగా పెరిగింది. అందుకే సినిమా కాస్ట్ కట్టింగ్ చేయాల్సిందే అంటూ సమ్మె చేస్తున్నారు. హీరోల పారితోషికాలు సినిమా మేకింగ్ కు అయ్యే మొత్తంలో దాదాపుగా సగం ఉంటుంది. కొందరు హీరోల పారితోషికం సినిమా బడ్జెట్ లో ఏకంగా 75 శాతం ఉంటుంది అనడంలో సందేహం లేదు. సినిమా మేకింగ్ కు ఎంత ఖర్చు చేసినా మాకు మాత్రం 100 కోట్లు ఇవ్వాలంటున్న హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు.
యంగ్ స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో ఒకప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం దక్కించుకున్న టాలీవుడ్ సీనియర్ హీరోల పారితోషికం ఎలా ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇండియాలో ఒక హీరో మొదట కోటి పారితోషికం తీసుకున్నది ఎవరు అంటే ఎక్కువ మంది బాలీవుడ్ హీరో అనుకుంటారు. కాని ఇండియాలో ఒక సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆ విషయం అప్పట్లో ఇండియా టుడే కవర్ పేజీ పై ప్రచురించింది. అలాంటి చిరంజీవి ఇప్పుడు ఒక్కో సినిమా కు పాతిక కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నాడు.
ఇతర హీరోలు వందల కోట్ల వద్ద దూసుకు పోతూ ఉంటే చిరంజీవి మాత్రం పాతిక కోట్ల వరకు పారితోషికం తీసుకుని ఆ తర్వాత లాభాల్లో వాటాగా కొంత మొత్తంను తీసుకుంటున్నాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు అలాగే ఒప్పందాలు జరిగాయని అంటున్నారు. ఇక బాలకృష్ణ అఖండ ముందు వరకు 15 నుండి 20 కోట్ల వరకు పారితోషికం ఉండేదట. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలకు పాతిక కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య పారితోషికం విషయంలో ఎప్పుడు కూడా పేచీ పెట్టింది లేదు. నిర్మాతలకు అనుకూలంగా బాలయ్య ఉంటాడు. ఇక నాగార్జున ఒక్కో సినిమాకు 15 నుండి 20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నాడట. వెంకటేష్ కూడా 10 కోట్ల నుండి 15 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.