Prabhas : టాలీవుడ్ సమ్మె వల్ల ప్రభాస్ కు ఎంత నష్టమో తెలిస్తే షాక్ అవుతారు
Prabhas : సినిమా బడ్జెట్ పెరిగి పోయింది… వందల కోట్ల పారితోషికాలు మేము హీరోలకు ఇవ్వలేక పోతున్నాం. థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు అంటూ తెలుగు సినిమా నిర్మాతలు ఆగస్టు 1వ తారీకు నుండి సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సమ్మె మెల్ల మెల్లగా సడలిస్తున్నారు అనిపిస్తుంది. కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇదే సమయంలో మరి కొన్ని సినిమాల విషయంలో మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో టాలీవుడ్ లో మరింతగా ఇబ్బందులు మొదలు అవుతున్నాయి.
టాలీవుడ్ నిర్మాతల సమ్మె ప్రభావంతో చాలా మంది హీరోల సినిమాలు వాయిదాలు పడ్డాయి. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే మరియు సలార్ సినిమాల షూటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయి. మొన్నటి వరకు జరిగిన ఈ షెడ్యూల్స్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతలో ఇలా జరగడంతో ఆ షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేశారు. సలార్ సినిమా దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇక ప్రాజెక్ట్ కే ఒక అంతర్జాతీయ సినిమా కనుక అంతకు మించిన బడ్జెట్ ఉంటుంది.
ఈ రెండు సినిమాల యొక్క షెడ్యూల్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కచ్చితంగా 20 కోట్ల నుండి 25 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా ప్రభాస్ డేట్లు వృదా అవుతున్న కారణంగా ఆయనకు కూడా అయిదు నుండి పది కోట్ల వరకు నష్టం తప్పదు అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి టాలీవుడ్ నిర్మాతల బంద్ వల్ల ఇండస్ట్రీలో అత్యధికంగా ఎఫెక్ట్ అవుతున్న హీరో ప్రభాస్.. మరియు సినిమాలు ఆయన నటిస్తున్న సినిమాలు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మె ఎప్పటికి ఆగి పోయేనో.. ఎప్పుడు షూటింగ్ లు పూర్తి స్థాయిలో జరిగేనో చూడాలి.