Raising Raju : రైజింగ్ రాజు ఇంకా జబర్దస్త్‌ లో టీం లీడర్ గా ఎలా కొనసాగుతున్నాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raising Raju : రైజింగ్ రాజు ఇంకా జబర్దస్త్‌ లో టీం లీడర్ గా ఎలా కొనసాగుతున్నాడు?

Raising Raju : జబర్దస్త్ షో ప్రారంభం అయిన సమయంలో ఉన్నటువంటి టీమ్‌ లీడర్స్ లో కొద్ది మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఎక్కువ శాతం మంది వెళ్లి పోయారు. టీమ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక్కరు సరిగా చేయకపోతే ఆ టీమ్ ని తొలగించడం.. లేదంటే ఒక టీంలో సరిగా కమెడియన్ చేయకపోతే తొలగించడం వంటివి చేస్తారు. హైపర్ ఆది టీం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. హైపర్ ఆది టీమ్ యొక్క పూర్తి పేరు హైపర్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 December 2022,7:00 pm

Raising Raju : జబర్దస్త్ షో ప్రారంభం అయిన సమయంలో ఉన్నటువంటి టీమ్‌ లీడర్స్ లో కొద్ది మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఎక్కువ శాతం మంది వెళ్లి పోయారు. టీమ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక్కరు సరిగా చేయకపోతే ఆ టీమ్ ని తొలగించడం.. లేదంటే ఒక టీంలో సరిగా కమెడియన్ చేయకపోతే తొలగించడం వంటివి చేస్తారు. హైపర్ ఆది టీం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. హైపర్ ఆది టీమ్ యొక్క పూర్తి పేరు హైపర్ ఆది రైజింగ్ రాజు. ఈ రైజింగ్ రాజుతో కలిసి హైపర్ ఆదికి ఒక టీం ని అప్పట్లో ఇవ్వడం జరిగింది.

రైజింగ్ రాజు ని పూర్తి గా పక్క కు పెట్టి హైపర్ ఆది తనదైన కామెడీ టైమింగ్ తో స్కిట్‌ లను చేస్తూ వస్తున్నాడు. స్కిట్ లో రాజుని పక్కకు పెడతాడేమో కానీ తన టీం పేరులో మాత్రం రైజింగ్ రాజుని హైపర్ ఆది అలాగే కొనసాగుతూ వస్తున్నాడు. అది అతనికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. రైజింగ్ రాజు యొక్క పేరును వాడుకోవాల్సిన అవసరం హైపర్ ఆదికి అస్సలు లేదు. టీం లీడర్ గా ఆయనను తొలగించిన ఎవ్వరేమన్నారు, కానీ హైపర్ ఆది మంచి మనసుతో రైజింగ్ రాజుని కూడా తన టీం లీడర్ గా కొనసాగిస్తున్నాడు.

how Raising Raju continues to be the jabardasth comedy show team leader with hyper aadi

how Raising Raju continues to be the jabardasth comedy show team leader with hyper aadi

మల్లెమాల వారు ఇచ్చే వారితోషికం లో రైజింగ్ రాజుకి ఒక టీం లీడర్ అన్నట్లుగా మంచి వాటాను హైపర్ ఆది ఇస్తాడట. పైకి అవమానించినట్లుగా మాట్లాడిన ప్రతి ఒక్కరి పట్ల చాలా బాధ్యతాయుతంగా హైపర్ ఆది వ్యవహరిస్తాడని.. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడని ఆయన చుట్టూ ఉన్నవారు అంటున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే కచ్చితంగా నేనున్నాను అంటూ వారికి సహాయం చేస్తాడని.. అందుకే రైజింగ్ రాజు ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాడని హైపర్ ఆది యొక్క సన్నిహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. టీం లీడర్ గా రైజింగ్‌ రాజు మరింత కాలం కొనసాగడం ఖాయం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది