Hyper aadi : హైపర్ ఆది మంచితనమిదే!.. కరోనా కష్టంలో అంటూ రైజింగ్ రాజు కంటతడి
Hyper aadi : హైపర్ ఆది టీంలో రైజింగ్ రాజు ఎంత కీ రోల్ పోషిస్తాడో అందరికీ తెలిసిందే. ఆయన మీద ఎన్ని వేల సెటైర్లు పంచులు వేశాడో లెక్కపెట్టలేం. రాజు, శాంతి స్వరూప్‌ల మీద కౌంటర్లు వేస్తూనే స్కిట్లు ముందుకు తీసుకెళ్తుంటాడు. అయితే హైపర్ ఆది రైజింగ్ రాజు అంటూ టీం ఇప్పటి వరకు కొనసాగుతూనే వచ్చింది. రైజింగ్ రాజు స్కిట్లో ఉన్నా లేకపోయినా కూడా ఆది మాత్రం ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంటాడు.
ఆ మధ్య కొన్ని రోజులు ఆది టీంలో రాజు కనిపించలేదు. కరోనా సమయంలో రాజు జబర్దస్త్కు దూరంగా ఉన్నాడు. ఇక మధ్యలో రాజుకి ఆరోగ్యం దెబ్బతింది. అలా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చిందట. కానీ జబర్దస్త్‌కు దూరంగా ఉన్నా కూడా డబ్బులు మాత్రం రెగ్యులర్‌గా పంపించాడట. తాజాగా ఈ విషయాలన్నీ కూడా రాజు బయటపెట్టేశాడు.
Raising Raju On Hyper aadi Help
Hyper aadi : ఆది గురించి చెబుతూ రాజు కంటతడి..
ఫస్ట్ లాక్డౌన్ సమయంలో మా ఇంట్లో చిన్న పాప ఉంది, నేను రాలేను ఆది గారు అని చెప్పాను. పర్లేదు మీరు రాకపోయినా పర్లేదు అని అన్నాడు. అలా ఆరు నెలలు నాకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు. ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు.. కాళ్ల మీద పడిపోదామని అంటే నాకంటే వయసులో చిన్నవాడు అయిపోయాడంటూ అందరి ముందు చెప్పేసి కంటతడి పెట్టేశాడు. హైపర్ ఆది మంచితనానికి ఇదో ఉదాహరణ అని అందరూ కామెంట్లు పెడుతున్నారు.