Hello Brother : నాగార్జున హలో బ్రదర్ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా?
Hello Brother : మీరు నాగార్జున డబుల్ యాక్షన్ రోల్ లో నటించిన హలో బ్రదర్ సినిమా చూశారా? ఆ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. నాగార్జునకు కూడా ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా. అప్పట్లో సరికొత్త కథతో వచ్చిన సినిమా అది. ఇద్దరు ట్విన్స్ చిన్నప్పుడే విడిపోయి.. వేర్వేరు దేశాల్లో పెరిగినా.. వాళ్లిద్దరు ప్రవర్తించే విధానం కూడా ఒకే విధంగా ఉండటం.. ఇద్దరూ కలుసుకోవడం.. ఇలా వినూత్నంగా ఉంటాయి.ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఈవీవీతో నాగార్జున అంతకుముందే వారసుడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత హలో బ్రదర్ సినిమా తీశారు. కానీ.. వారసుడు సినిమా కన్నా కూడా హలో బ్రదర్.. సూపర్ డూపర్ హిట్ అయింది.
Hello Brother : మరి.. ఈ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి?
అయితే.. ఈ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధం ఉంది. ఎలా అంటారా? నిజానికి.. ఇలాంటి కథతో సినిమా ఎప్పుడో వచ్చింది. అదే అగ్గి పిడుగు. 1964లోనే రిలీజ్ అయింది. ఆ సినిమాలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. బ్రహ్మ విఠలాచార్య డైరెక్టర్. అప్పట్లోనే ఆ సినిమా రికార్డులను తిరగరాసింది.అది కూడా సేమ్.. హలో బ్రదర్ సినిమా లాంటి స్టోరీనే. అంటే.. ఈవీవీ సత్యనారాయణ..
అగ్గి పిడుగు సినిమాను ప్రేరణగా తీసుకొని హలో బ్రదర్ కథ రాసుకొని ఉంటారు అని ఫిలిం నగర్ టాక్. అంతే కాదు.. జాకీచాన్.. ట్విన్స్ అనే సినిమాలో నటించారు. అది కూడా సేమ్ ఇలాంటి కథే. దీంతో.. ట్విన్స్, అగ్గి పిడుగు.. ఈ రెండు సినిమాను ప్రేరణగా తీసుకొని ఈవీవీ సత్యనారాయణ.. హలో బ్రదర్ కథ రాసుకొని ఉంటారు అని తెలుస్తోంది. ఏది ఏమైనా.. హలో బ్రదర్ సినిమాకు, సీనియర్ ఎన్టీఆర్ అగ్గి పిడుగు సినిమాకు అలా లింక్ కుదిరిందన్నమాట.