Samantha : సమంత రేంజ్ అంటే ఇదే మరి.. రూ. 3 కోట్లతో యశోద మూవీ సెట్..!
Samantha : సమంత రూత్ ప్రభు.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం లేని పేరు. ఏమాయ చేశావే మూవీతో అందరినీ మాయ చేసిన ఈ బ్యూటీ.. అందంతోనే కాదు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలోను వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత.. కొంత కాలంగా పంథాను మార్చుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, ప్రయోగాలకు సైతం సిద్ధం అవుతోంది.
మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోంది. సమంత నటించిన శాకుంతలం చిత్రం విడుదలకి సిద్ధం కాగా, యశోద షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.సెట్ కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు నిర్మాత తెలిపారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ..“సమంత ప్రధాన తారగా మేం నిర్మిస్తున్న ‘యశోద’ సినిమాలో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఓ ప్రాంతంలో జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్‌లో చాలా స్టార్ హోటల్స్ చూశాం. అయితే… 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత సులభం కాదు. అందుకని, సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో సెట్స్ రూపొందించాం అని అన్నారు.

huge set for samantha movie
Samantha : సమంత తగ్గట్లేదుగా..!
నానక్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ… సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోంది అని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటించారు.