Anasuya : అనసూయ తనను లవ్ చేస్తుందని అందరి ముందు చెప్పిన హైపర్ ఆది
Anasuya : హైపర్ ఆది స్కిట్స్ అంటే ఏ రేంజ్ కిక్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల తూటాలతో రెచ్చిపోయే ఆయన ప్రతి పదంలోనూ జబర్దస్త్ పంచ్ ఉండేలా చూసుకుంటాడు. ఇక మనోడి రొమాంటిక్ యాంగిల్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. లేడీ కమెడియన్స్‌తో ఆయన వేసే స్కిట్స్, పేల్చే డైలాగ్స్ అబ్బో.. మాటల్లో వర్ణించలేం. జబర్ధస్త్‌లో అనసూయతో మనోడు పేల్చే పంచ్‌లు ఆడియాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంటాయి. జనవరి 20న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా, హైపర్ ఆది పుష్ప గెటప్‌లో అదరగొట్టాడు.
తాజాగా పుష్పరాజ్ గెటప్ వేసి అనసూయను ఉద్దేశిస్తూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జబర్ధస్త్ ఎపిసోడ్ ప్రోమోలో పుష్ప సినిమాలోని క్యారెక్టర్లను రీ- క్రియేట్ చేశాడు ఆది. పుష్పరాజ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. రావడం రావడమే అనసూయపై కన్నేశాడు. తగ్గేదేలే అంటూనే నాకు అనసూయ ఐ లవ్ యూ చెప్పిందని అనేశాడు. దీంతో ఆమె తెగ సిగ్గుపడిపోయింది. ఇక దాక్షాయణి పాత్రలో ఉన్న శాంతి మాదిరిగా అనసూయ ఉందని అనే సరికి ఆమె కోపపడుతూనే నవ్వేసింది. జనవరి 20వ తేదీన ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

hyper aadi fun with ansusya In Jabardasth Latest Promo
Anasuya : నసూయ మాస్త్ కిక్ ఇస్తుందిగా..!
ఇప్పటికే ఆన్ స్క్రీన్‌పై చాలాసార్లు రొమాంటిక్ స్టెప్పులేసి బుల్లితెర ఆడియన్స్‌కి కిక్కిచ్చింది అనసూయ- హైపర్ ఆది జోడి. మొత్తానికి ప్రోమోలో ఈ జంట మరోసారి కార్యక్రమంపై హైప్ తెచ్చారు. ఇక మిగతా ఆర్టిస్టుల స్కిట్స్ కూడా పేలిపోయాయి. వీరు తెగ సందడి చేయనున్నారని ప్రోమోని చూస్తుంటే అర్దమవుతుంది. మొత్తానికి ప్రేక్షకులకి ఏ పాయింట్ కావాలో దాన్నే మెయిన్‌గా టార్గెట్ చేసి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
