Hyper Aadi : ముష్టి జోడి అంటూ దారుణంగా కించపరిచిన హైపర్ ఆది.. వర్ష ఇమాన్యుయేల్ పరువుపాయే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : ముష్టి జోడి అంటూ దారుణంగా కించపరిచిన హైపర్ ఆది.. వర్ష ఇమాన్యుయేల్ పరువుపాయే

 Authored By prabhas | The Telugu News | Updated on :2 July 2022,8:00 pm

Hyper Aadi : బుల్లితెరపై జోడిలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కేవలం టీఆర్పీ కోసమే కొన్ని ట్రాకులు పుట్టుకొచ్చాయి. అలా వచ్చిన కొన్ని ట్రాకులు చివరకు నిజమైన రిలేషన్‌గా మారినట్టున్నాయి. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలు వర్కవుట్ అవ్వడంతో ఇలా జోడిలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ పరంపరను మొదలుపెట్టేసింది సుడిగాలి సుధీర్ రష్మీ. ఈ ఇద్దరి జోడిని ఢీ కొట్టే జోడి ఇంకోటి రాలేదు. కానీ మధ్యలో వర్ష ఇమాన్యుయేల్ జంట ఓ మోస్తరుగా ఫేమస్ అయింది. కానీ ఎంత త్వరగా ఫేమస్ అయిందో అంతే త్వరగా కిందకు పడిపోయింది. వర్ష ఇమాన్యుయేల్ జోడి మధ్యలో తెగ హడావిడి చేసింది. మల్లెమాల అలా చేయించినట్టుంది.

జబర్దస్త్ డైరెక్షన్ టీం కూడా బాగానే రెచ్చిపోయింది. అయితే ఈ జోడిని కూడా రష్మీ సుధీర్‌లానే చేద్దామని ఫిక్స్ అయినట్టుంది ఆ టీం. అందుకే ఈ ఇద్దరి పెళ్లి ఈవెంట్ కూడా జబర్దస్త్ వేదిక మీద చేశారు. ఆ స్కిట్, ఆ ఈవెంట్‌ను చూసి జనాలు చీదరించుకోవడం మొదలుపెట్టారు. ఇంకెన్నాళ్లు ఇలాంటి పనులు చేస్తారంటూ.. ఇంకెనాళ్లు ఇలా జనాలను పిచ్చోళ్లను చేస్తారంటూ ఫైర్ అయ్యారు. దీంతో ఆ జోడి హడావిడి కాస్త తగ్గింది. అప్పటి నుంచి బుల్లితెరపై ఈ ఇద్దరూ లవర్స్‌గా కనిపించే స్కిట్లు చేయలేదు. మధ్యలో తన మీద ట్రోలింగ్ జరగడం గురించి స్టేజ్ మీద మాట్లాడుతూ వర్ష కన్నీరు పెట్టేసుకుంది.

Hyper Aadi Humiliates Varsha Emmanuel In Sridevi Drama Company

Hyper Aadi Humiliates Varsha Emmanuel In Sridevi Drama Company

ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకు అంత తిడుతున్నారు అని చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి ఇప్పుడు మళ్లీ ఈ జోడి ట్రాక్ మీదకు ఎక్కేసింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఈ జోడి బాగానే రెచ్చిపోతోంది. అయితే తాజాగా హైపర్ ఆది వేసిన ఈ పంచ్‌కు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాకుండాపోయినట్టుంది. జబర్దస్త్ షోలో జోడిలు చేసే ఓవర్ యాక్షన్ మీద హైపర్ ఆది పంచ్‌లు వేస్తూ వచ్చాడు. ఇందులో భాగంగా సుధీర్ రష్మీ జోడికి దిష్టి తగిలిందేమో అని వర్ష అంటుంది. వాళ్లది దిష్టి జోడి.. మీది ముష్టి జోడి అని వర్ష, ఇమాన్యుయేల్ పరువు తీసేస్తాడు హైపర్ ఆది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది