Hyper Aadi : కామెడీ స్టార్స్ లో ప్రత్యక్షం కాబోతున్న హైపర్ ఆది.. నిజమేనా?
Hyper Aadi : ఈటీవీలో జబర్దస్త్ దాదాపు పది సంవత్సరాలు గా టెలికాస్ట్ అవుతోంది. ఈ పది సంవత్సరాల్లో అయిదు ఆరు సంవత్సరాలుగా హైపర్ ఆది తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తూ వస్తున్నాడు. కామెడీకి సరి కొత్తగా అర్థాన్ని ఇచ్చి తనదైన శైలిలో పంచులతో కడుపుబ్బ నవ్వించాడు. హైపర్ ఆది కామెడీ చాలా ప్రత్యేకమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్తమాన అంశాల గురించి తన స్కిట్లు ల్లో చూపిస్తూ నవ్వించడం లో హైపర్ ఆది కి వందకు వంద మార్కులు వేయొచ్చు. అలాంటి హైపర్ ఆది గత నాలుగైదు వారాలు జబర్దస్త్ స్టేజ్ కనిపించడం లేదు.
జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆయన కలిపించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైపర్ ఆది మరియు రైజింగ్ రాజు టీం పూర్తిగా కనుమరుగు కావడంతో అసలే ఏమయిందో తెలిక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. ఒకవేళ హైపర్ ఆది బయటికి వెళ్లి ఉంటే ఆయన టీం మెంబెర్స్ అయినా కనిపిస్తూ ఉండాలి కదా అంటూ కొందరి మద్య చర్చ జరుగుతుంది. ఈ వారం వస్తాడు..తదుపరి వారం వస్తాడు.. మరో వారం వస్తాడు అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈటీవీలో హైపర్ ఆది నిర్ణయానికి వచ్చేశారు.

Hyper Aadi in to star maa comedy stars
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమంలో పాల్గొన్న పోతున్నాడ.ట భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో స్టార్ మాకు హైపర్ ఆది ఓకే చెప్పినట్లుగా సమాచారం. బుల్లి తెర వర్గాల ద్వారా ఈ సమాచారం అందుతోంది. ప్రస్తుతం హైపర్ ఆది మల్లెమాల వారితో ఉన్న ఒప్పందం ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే ఆయన మల్లెమాల అగ్రిమెంటు నుండి బయట పడే అవకాశం ఉంది. ఆ వెంటనే స్టార్ మా కి సైన్ చేసేందుకు హైపర్ ఆది సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేవలం ఆయన మాత్రమే కాకుండా ఆయన టీం లో ఉండే అందరు కూడా స్టార్ మా స్టేజిపై ప్రత్యక్ష కాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.