Hyper Aadi : రోజాను ఇంత దారుణంగా అవమానించాడేంటి?.. హైపర్ ఆది మామూలోడు కాదు
Hyper Aadi : జబర్దస్త్ షోలో రోజా, అనసూయల మీద పంచులు, సెటైర్లు వేయాలంటే అది కేవలం ఆది వల్లే అవుతుంది. హైపర్ ఆది పంచ్‌లు వేస్తే వారు కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. బాగానే కో ఆపరేట్ చేస్తారు. తిరిగి సెటైర్లు వేస్తుంటారు. అలా ఈ ముగ్గురి కాంబినేషన్ బాగుంటుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే రోజాను దారుణంగా ఆడుకున్నాడు.రోజా హోం టూర్ అంటూ నగరికి వెళ్లింది హైపర్ఆది టీం.
ఇక ఇందులో రోజా తన వంట గదిని చూపిస్తుంది.. టీ కోసం సాల్ట్ ఎక్కడుందో అడుగుతుంది. గ్యాస్ స్టవ్ వెలిగించి రోజా ఆనందం పడుతుంది. నాకు వంటొచ్చేసిందని సంబరపడుతుంది. ఈవిడేంటి.. గ్యాస్ వెలిగించి.. ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించినంతగా ఆనంద పడుతోందేంటని కౌంటర్ వేస్తాడు.చివరకు టీ పెట్టిస్తుంది రోజా. ఎలా ఉందని రోజా అడుగుతుంది.

Hyper Aadi Punches on Roja Age In Jabardasth
Hyper Aadi : రోజా వయసుపై ఆది కౌంటర్లు..
బాగానే ఉంది కానీ ఇది టీ అయితే బాగుండు అని మరో కౌంటర్ వేస్తాడు. మీ కోరిక ఏంటని రోజాని ఆది అడుగుతాడు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబుతో నటించాలని ఉందని అంటుంది. ఈ వయసులో కృష్ణా రామా అనుకుంటూ మూలన ఉండక.. కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు అవసరమా? అని దారుణంగా అనేస్తాడు.
