Hyper Aadi : హైప‌ర్ ఆది అన్ని కోట్లు సంపాదించాడా.. అవాక్క‌వుతున్న అభిమానులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : హైప‌ర్ ఆది అన్ని కోట్లు సంపాదించాడా.. అవాక్క‌వుతున్న అభిమానులు

 Authored By sandeep | The Telugu News | Updated on :24 October 2022,7:00 pm

Hyper Aadi : జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైప‌ర్ ఆది ఒక‌రు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ బుల్లితెరపైకి దూసుకొచ్చిన హైపర్ ఆది.. జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు.జబర్దస్త్ తో పాటు ఇత‌ర షోల‌తో హైప‌ర్ ఆది ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్ర‌స్తుతం హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి మామూలుగా ఉండదు. కేవలం పంచులతో మనస్పూర్తిగా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం సినిమాలలో కూడా ఆది తన టాలెంట్ నిరూపిస్తున్నాడు. ఇంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది ఆస్తులు వెనకేయడంలో కూడా ముందున్నాడు.

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని సొంత ఊరిలో ఇప్పటికే సుమారు 16ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితుల మాట. హైప‌ర్ ఆది జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి వెళ్ల‌ముందు ఆయ‌న ప‌రిస్థితి దారుణంగా ఉండేది. ఇండస్ట్రీకి వచ్చాక తన టోటల్ ఆస్తి సుమారు 50 కోట్ల పైనే అంటున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్య హైదరాబాద్లో కొనుగోలు చేసిన ఇంటి ఖరీదే దాదాపు 10 కోట్లు ఉంటుందని ..ఇదే కాకుండా హైపర్ ఆది ఒక్క ఎపిసోడ్ కి 70 వేలు చార్జ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది . ఈవెంట్‌ను బట్టి పారితోషికం డిమాండ్‌ చేసే ఆది ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలలో ఒక్క స్కిట్‌కి గానూ లక్షల్లో అందుకుంటాడని చెప్పుకుంటారు. దీన్ని బట్టి టీవీ షోల ద్వారానే ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని ఇండస్ట్రీ టాక్.

hyper aadi remuneration topic now

hyper aadi remuneration topic now

Hyper Aadi : అంత సంపాదించాడా..!

ఇది కాకుండా సినిమాల్లోనూ నటిస్తున్న ఆది అక్కడ కూడా గట్టిగానే వెనకేస్తున్నాడని చెప్పుకుంటారు. హైపర్ ఆది బిటెక్ పూర్తి చేసుకుని సంపాదన కోసం హైదరాబాద్ వచ్చే సమయంలో తన పదహారే ఎకరాల పొలం అమ్మడమే కాకుండా ఏకంగా 20 లక్షల రూపాయల అప్పు కూడా ఉండేదట.అయితే ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీగా సంపాదించి తన అప్పు మొత్తం కట్టడమే కాకుండా తాను అమ్మిన 16 ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశారు. ఇకపోతే ఆది తండ్రికి ఉంగరాలు అంటే ఎంతో పిచ్చి అని తెలిసింది. తన తండ్రి చేతి పదివేలకు పది ఉంగరాలను కూడా కొనిచ్చినట్టు ఓ సందర్భంలో వెల్లడించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది