Hyper Aadi : ఎంత కించపరిచినా ఏం చేయలేకపోయింది!.. హైపర్ ఆది దెబ్బకు అవాక్కైన అనసూయ
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది వేసే పంచ్‌లు, అందులో అనసూయను ఆడుకునే తీరు మామూలుగా ఉండదు. ఆది తన మనసులోని కోరికలు అలా బయటపెడతాడా? లేదా కేవలం స్కిట్ కోసం అలా స్క్రిప్ట్‌లో డైలాగ్స్ రాసుకుంటాడో ఏమో తెలీదు కానీ.. అనసూయ మీద ఇష్టాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెడుతూనే ఉంటాడు. ఇక ఆమెను కొన్ని స్కిట్లలో దారుణంగా ట్రోల్ చేస్తుంటాడు.ఇక ఈ వారం చేసిన పుష్ప స్పూప్‌లో దారుణంగా అనసూయను కించపరిచాడు.
మనో గారు అంటూ.. నీయవ్వ తగ్గేదేలే అంటాడు. కానీ రోజా, అనసూయలను మాత్రం కేవలం తగ్గేదేలే అని అంటాడు. వాళ్లే అవ్వల్లా ఉన్నారు.. మళ్లీ అనడం ఎందుకు అంటూ కౌంటర్లు వేస్తాడు. ఇక దాక్షాయణిగా శాంతి స్వరూప్‌ను పెట్టి అనసూయ పరువంతా కూడా తీసేస్తాడు.అనసూయ, శాంతి స్వరూప్ ఒకేలా ఉన్నారట.. దాక్షాయణిగా ఇద్దరూ ఒకేలా ఉన్నారంటూ ఆది కౌంటర్ వేస్తాడు.

Hyper aadi Satires On Anasuya As Shanthi Swaroop Dakshyani Getup
Hyper Aadi : అనసూయను ఆడుకున్న ఆది..
కానీ అనసూయ ఏమీ అనలేక నవ్వుతూ ఉంటుంది. అనసూయ కాబట్టి పీక కోసింది.. శాంతి కాబట్టి ఉప్పెనే అని మరో డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు. అలా ఆది ఆ స్కిట్‌లో అనసూయ మీద పరోక్షంగా ఇలా పంచ్‌ల వర్షం కురిపిస్తాడు. కానీ ఏం చేయలేక అలా అవాక్కైనట్టుగా చూస్తుంటుంది అనసూయ.