Hyper Aadi : అంత ఓవర్ చేసింది కదా?.. చివరకు వర్ష పరువుతీసిన హైపర్ ఆది
Hyper Aadi : బుల్లితెరపై టీఆర్పీల కోసం ఎలాంటి వేషాలైనా వేస్తుంటారు. ఏదో గొడవలు జరిగినట్టు, ఏదో అయిపోయినట్టు కథలు పడుతుంటారు. గత ఆదివారం జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో వర్ష, ఇమాన్యుయేల్ మధ్య జరిగింది కూడా ఇదే. డైరెక్షన్ టీం చెప్పినట్టుగా వర్ష బాగానే నటించినట్టుంది. మగాడు అనే కామెంట్లతో తాను బాధపడినట్టు బాగానే జీవించేసింది.
వర్ష స్టేజ్ మీద నుంచి వెళ్లిపోవడం, పదే పదే అనడం నాకు నచ్చలేదు, నేను ఉండను వెళ్లిపోతాను అని అనడంతో వర్ష మీద అందరూ సానుభూతి చూపించారు. తాను ఎంతకీ సారీ చెప్పను అని మొండికేసిన ఇమాన్యుయేల్ చివరకు క్షమాపణలు చెప్పేశాడు. అయినా కూడా వర్ష మాత్రం డల్‌గా వెళ్లి కూర్చుంది. అంతటి వరకు వారి డ్రామా ముగిసింది.

Hyper Aadi Satires on Jabardasth Varsha In SRidevi Drama Company
Hyper Aadi : వర్షపై ఆది కౌంటర్లు..
ఈ ఇద్దరిని కాస్త కూల్ చేసేందుకు ఓ లవ్ సాంగ్ వేశారు. ఇద్దరూ మామూలుగా ఇది వరకటిలానే డ్యాన్స్ వేసేశారు. వర్ష నవ్వేసింది. అయితే అనంతరం ఆది అందుకుని వర్ష పరువుతీసేశాడు. ఆ షోకు రాం ప్రసాద్, ఆది ఇద్దరూ హోస్ట్‌లు. కానీ హోస్టింగ్‌లో తనను పట్టించుకోవడం లేదని ఆది వెళ్లిపోతాడు. వర్షలా నటించి ఆమె పరువు తీసేశాడు.
