Hyper Aadi : ఢీ షోలో ముద్దుల గోల.. అనిల్ రావిపూడిని ఇరికించిన హైపర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : ఢీ షోలో ముద్దుల గోల.. అనిల్ రావిపూడిని ఇరికించిన హైపర్ ఆది

 Authored By prabhas | The Telugu News | Updated on :20 May 2022,4:30 pm

Hyper Aadi : బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఆ షోలకు గిరాకీ ఎక్కువగా ఉందని తెలిసే.. రకరకాల షోలను ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే డ్యాన్స్ షోలో.. డ్యాన్స్ ఉండదు. పాటల కార్యక్రమంలో పాటలు ఉండవు. అన్నింట్లోనూ వెకిలి చేష్టలే. పిచ్చి పనులే కనిపిస్తుంటాయి. అలా ఢీ షో ఎప్పుడో గాడి తప్పింది. పూర్ణ, నందిత వంటి వారిని పట్టుకొచ్చి నానా కంపు పట్టించేశారు ఢీ షోని.పూర్ణ అయితే పిల్లలనే కాకుండా పెద్దవారిని కూడా ముద్దులు పెట్టి నానా హంగామా చేసేది. కంటెస్టెంట్లకు, టీం లీడర్లకు ముద్దులు పెడుతూ పూర్ణ రచ్చ రచ్చ చేసింది.

మాస్టర్ల బుగ్గలు కూడా కొరికేది. ఇక ఇప్పుడు పూర్ణ స్థానంలో నందిత శ్వేత వచ్చింది. ఈమెను డ్యాన్స్ షోకు న్యాయనిర్ణేతగా ఎందుకు తీసుకున్నారో మల్లెమాల టీంకే తెలియాలి. ఇక ఈమె కూడా ఆ ముద్దుల బాటలోనే నడుస్తోంది. ఆ మధ్య చైల్డ్ ఆర్టిస్ట్ నేహాంత్ ఢీ షోకి వచ్చాడు. నేహాంత్ కూడా కరువులో ఉన్న ప్రవర్తించాడు.ముద్దులతో ఢీ షోలో నానా హంగామా చేస్తుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ నందిత శ్వేత ఓ బుడ్డోడికి ముద్దు పెట్టేసింది. దీనిపై ఆది కౌంటర్ వేశాడు. అంతే కాకుండా వచ్చిన గెస్టు అనిల్ రావిపూడిని కూడా మధ్యలోకి లాక్కొచ్చాడు.

Hyper Aadi Satires On Nanditha Swatha K In Dhee

Hyper Aadi Satires On Nanditha Swatha K In Dhee

మొత్తానికి ఆది మాత్రం ఈ ముద్దుల గోలతో తట్టుకోలేకపోతోన్నట్టు కనిపిస్తోంది. నువ్ ముద్దులు పెట్టుకుని, ఆ మధ్యలో ఉన్నవాళ్లు కూడా ముద్దులు పెట్టుకుని, ఆ కొత్తగా వచ్చిన వాళ్లు కూడా పెట్టుకుంటే మేం ఎక్కడికి పోవాలని అని ఆది ఆవేదన చెందుతాడు.మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావ్ అంటూ అనిల్ రావిపూడి అంటాడు. మీరు కూడా వెళ్తారు లేండి.. కొంచెం టైం అయ్యాక అని మెల్లిగా కౌంటర్లు వేస్తాడు ఆది. ఈ లోపు జానీ మాస్టర్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇలాంటివన్నీ చిన్నప్పుడు చాలానే చేసి ఉంటాడులే అని కౌంటర్లు వేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది