Hyper Aadi : బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అది ఎప్పటికీ తగ్గదు. వారిద్దరరూ ఉన్నంత వరకు బుల్లితెరపై ఆ క్రేజ్ అలా ఉంటూనే ఉంటుంది. తామిద్దరి మధ్య ఏమీ లేదని, తాము కేవలం స్నేహితులమేనని, స్క్రీన్ మీద మాత్రమే అలా నటిస్తామని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా మేం నటిస్తామని రష్మీ, సుధీర్ ఎన్నో సార్లు క్లారిటీగా చెప్పారు.
కానీ సుధీర్ రష్మీ ఫ్యాన్స్ మాత్రం వారిద్దరూ ఒక్కటైతే చూడాలని అనుకుంటూ ఉంటారు. ఇక జనాల్లో ఉన్న ఈ క్రేజ్‌తోనే బుల్లితెరపై సుధీర్ రష్మీ మీద పంచులు వేస్తుంటారు. ఆది, రాం ప్రసాద్ ఇలా అందరూ కూడా సుధీర్ రష్మీ మీద కౌంటర్లు వేస్తుంటారు. ఈ మధ్య అయితే వర్ష సైతం అక్కా బావా అంటూ రష్మీ సుధీర్‌ల మీద పంచులు వేస్తుంటోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో ఆది గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
చాలా నెలల తరువాత ఆది మళ్లీ జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. గత మూడు నెలలుగా ఆది కనిపించకపోవడంతో జబర్దస్త్ అంతా చిన్నబోయింది. మధ్యలో అనసూయ కూడా వెళ్లిపోయింది. అనసూయ వెళ్లిపోవడంతో ఆ స్థానంలోకి రష్మీ వచ్చింది. అలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో రష్మీనే కనిపిస్తోంది. అయితే ఆది వచ్చీ రాగానే రష్మీ మీద కౌంటర్లు వేశాడు.
గ్రాండ్‌గా ఆదికి వెల్కమ్ చెప్పింది జబర్దస్త్ టీం. అయితే రష్మీ దగ్గరకు వెళ్లిన ఆది ఇలా అంటాడు..నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు ఆది. నా వెనకాల చాన్నాళ్లు తిరగాలి అని అంటుంది రష్మీ. ఇది తెలియక మన గాలోడు చానెళ్లన్నీ తిరిగేస్తున్నాడేంటి? అని సుధీర్ మీద పరోక్షంగా ఆది కౌంటర్లు వేస్తాడు
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.