Hyper Aadi : తెలియక అన్ని చానెళ్లు తిరుగుతున్నాడా?.. రష్మీతో లింక్ చేస్తూ సుధీర్ మీద ఆది పంచ్

Authored By aruna | The Telugu News | Published on: September 10, 2022, 10:00 pm

Hyper Aadi : బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అది ఎప్పటికీ తగ్గదు. వారిద్దరరూ ఉన్నంత వరకు బుల్లితెరపై ఆ క్రేజ్ అలా ఉంటూనే ఉంటుంది. తామిద్దరి మధ్య ఏమీ లేదని, తాము కేవలం స్నేహితులమేనని, స్క్రీన్ మీద మాత్రమే అలా నటిస్తామని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా మేం నటిస్తామని రష్మీ, సుధీర్ ఎన్నో సార్లు క్లారిటీగా చెప్పారు.

కానీ సుధీర్ రష్మీ ఫ్యాన్స్ మాత్రం వారిద్దరూ ఒక్కటైతే చూడాలని అనుకుంటూ ఉంటారు. ఇక జనాల్లో ఉన్న ఈ క్రేజ్‌తోనే బుల్లితెరపై సుధీర్ రష్మీ మీద పంచులు వేస్తుంటారు. ఆది, రాం ప్రసాద్ ఇలా అందరూ కూడా సుధీర్ రష్మీ మీద కౌంటర్లు వేస్తుంటారు. ఈ మధ్య అయితే వర్ష సైతం అక్కా బావా అంటూ రష్మీ సుధీర్‌ల మీద పంచులు వేస్తుంటోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో ఆది గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

Hyper Aadi Satires on Sudheer Rashmi Gautam in Jabardasth Latest Promo

Hyper Aadi Satires on Sudheer Rashmi Gautam in Jabardasth Latest Promo

చాలా నెలల తరువాత ఆది మళ్లీ జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. గత మూడు నెలలుగా ఆది కనిపించకపోవడంతో జబర్దస్త్ అంతా చిన్నబోయింది. మధ్యలో అనసూయ కూడా వెళ్లిపోయింది. అనసూయ వెళ్లిపోవడంతో ఆ స్థానంలోకి రష్మీ వచ్చింది. అలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో రష్మీనే కనిపిస్తోంది. అయితే ఆది వచ్చీ రాగానే రష్మీ మీద కౌంటర్లు వేశాడు.

గ్రాండ్‌గా ఆదికి వెల్కమ్ చెప్పింది జబర్దస్త్ టీం. అయితే రష్మీ దగ్గరకు వెళ్లిన ఆది ఇలా అంటాడు..నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు ఆది. నా వెనకాల చాన్నాళ్లు తిరగాలి అని అంటుంది రష్మీ. ఇది తెలియక మన గాలోడు చానెళ్లన్నీ తిరిగేస్తున్నాడేంటి? అని సుధీర్ మీద పరోక్షంగా ఆది కౌంటర్లు వేస్తాడు

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp