Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ను పంపించేశారా?.. అసలు విషయం బయటపెట్టేసిన హైపర్ ఆది
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఈటీవీకి దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. మల్లెమాల టీంకు మెల్లిమెల్లిగా దూరమయ్యాడు. మొదటగా ఢీ షోనుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు మొత్తంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి వెళ్లిపోయాడు. అలా చివరకు ఈటీవీలో ఏ ప్రోగ్రాం కూడా చేయడం లేదు. అయితే ఇందులో పెద్ద కారణమే ఉందనిపిస్తోంది. ఒకవేళ హీరోగా చేస్తున్నాడు, సమయం ఇవ్వలేకే అలా వెళ్లిపోతోన్నాడు అనుకుంటే.. స్టార్ మా చానెల్‌లో ఎలా చేస్తాడు అన్నది ప్రశ్న. సుధీర్‌కు మల్లెమాల టీంకు గ్యాప్ వచ్చిందని అక్కడే అర్థమవుతోంది.
ఇన్ని రోజులు అగ్రిమెంట్ మూలానే అక్కడ ఉండాల్సి వచ్చిందని, ఇప్పుడు అది పూర్తవ్వడంతోనే ఇలా బయటకు వచ్చేశాడని అర్థమవుతోంది. అయితే సుధీర్ తనంతట తాను వచ్చాడా? లేదా వాళ్లే వెళ్లమని చెప్పారా? లేక పొమ్మనలేక పొగబెట్టాడా? అన్నది అర్థం కావడం లేదు. తాజాగా హైపర్ ఆది చేసిన కామెంట్లతో మరో కొత్త అనుమానం తెర మీదకు వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రాంం ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో హైపర్ ఆదికి సన్మానం చేయాలని అందరూ ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని రాం ప్రసాద్ చెబుతాడు. ఏంటి అంటే.. నన్ను కూడా వాడిలానే పంపుదామని అనుకుంటున్నారా?

Hyper Aadi Satires on Sudigali Sudheer in Sridevi Drama Company
అని అంటారు. అంటే సుధీర్‌ను కావాలనే పంపించారా? అన్ని కొత్త డౌట్ అందరిలోనూ మెదులుతోంది. ఇక మరోసందర్భంలో రష్మిని సుధీర్ గురించి పరోక్షంగా అడుగుతాడు. ఓ ఎపిసోడ్ చేశావ్ కదా? బాబు ఏమన్నాడు అని ఆది అడుగుతాడు. అయితే దానికి రష్మి ఇలా సమాధానం ఇస్తాడు. బాగుందన్నాడు.. కానీ రాం ప్రసాద్, ఆది పక్కన లేకపోతే ఇంకా చాలా బాగుండేదని అంటుంది. ఆ అన్నాడా? అందుకే పంపించేశాం అని ఆది కౌంటర్ వేస్తాడు. అంటే సుధీర్‌ను కావాలనే శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి పంపించేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఆది మాటలకు అర్థమదేనా? అన్నది చూడాలి.
