Hyper Aadi : రెచ్చిపోయిన ఆది, ఇమాన్యుయేల్, వర్ష.. టీఆర్పీ స్టంట్లకే స్టంట్లు

Authored By aruna | The Telugu News | Published on: August 21, 2022, 1:40 pm

Hyper Aadi : మల్లెమాల ఎప్పుడూ కూడా ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ప్రోమోలను వెరైటీగా కట్ చేసి.. ఏదో జరిగినట్టు భ్రమ కలిగింది.. అందరిలోనూ అనుమానాలు క్రియేట్ చేసి.. షో మీద, ఈవెంట్ మీద ఆసక్తి కలిగించేలా చేయడం టీఆర్పీ స్టంట్, స్ట్రాటజీ అవుతుంది. వీటిలో మల్లెమాల టీం ఆరితేరిపోయింది. అది ఏ ఈవెంట్ అయినా ఏ ప్రోగ్రాం అయినా కూడా మల్లెమాల తీరు మాత్రం ఒకటేలా ఉంటుంది. తాజాగా వినాయక చవితి ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులోనూ ఇలాంటి స్టంట్లే కనిపించాయి. మన ఊరి దేవుడు అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో కృష్ణ భగవాన్, నాగినీడు, కుష్బూ వంటివారు ముఖ్య అతిథులుగా వచ్చారు.

ఇక ఇందులో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం సందడి చేసింది. గెటప్ శ్రీను, వర్ష, ఇమాన్యుయేల్, ఆది ఇలా అందరూ రచ్చ రచ్చ చేశారు. ఇక మరీ ముఖ్యంగా వర్ష, ఇమాన్యుయేల్ ప్రేమల మీద పరీక్షలు పెట్టారు. వారి చేతుల మీద కార్లు పోనిచ్చుకోవాలని అన్నారు. ఇక తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ మాదిరి ఇమాన్యుయేల్ తన చేతుల మీదు నుంచి కారుని పోనిచ్చుకున్నాడు. ఇక వర్షను కూడా అలా చేయమని అన్నాడు. నువ్వొద్దు, నీ ప్రేమొద్దు అని వర్ష వెళ్లిపోయింది. కానీ చివరకు ఆమె చేతి మీద నుంచి కూడా కారుని పోనిచ్చారు. ఆ టాస్క్ అయిన తరువాత ట్యూబ్ లైట్లతో కొట్టుకునే టాస్క్ ఇచ్చాడు ఆది.

Hyper Aadi varsha Emmanuel in Mana Oori Devedu Event

Hyper Aadi varsha Emmanuel in Mana Oori Devedu Event

అయితే ఈ ట్యూబ్ లైట్‌లతో తాము కొట్టుకోమని అంటారు వర్ష, ఇమ్ము. కానీ ఇంతలో ఆది దీంట్లో ఏముందని ఇమ్ముని కొట్టేస్తాడు. ఏదో నిజంగానే దెబ్బ తగిలినట్టు బిల్డప్ ఇస్తాడు ఇమ్ము. నా ఇమ్ముని కొడతావా? అంటూ వర్ష తెగ రెచ్చిపోతుంది. ఆదిని కూడా ట్యూబ్ లైట్‌తో కొడుతుంది. ఇక చివరకు వర్ష బ్యాక్ మీద ఆది తన ట్యూబ్ లైట్‌లతో వాయించేస్తాడు. అలా మొత్తానికి ఈ ముగ్గురు కూడా ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తారు. ఏదో ప్రమాదం జరిగినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇక ఈ ప్రోమోను చూసి జనాలంతా తలలు పట్టుకుంటున్నారు. ఇంకెన్నాళ్లు ఇలాంటివి చేస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp