Sudigali Sudheer : జబర్దస్త్ లోసుడిగాలి సుధీర్ పై హైపర్ ఆది డామినేషన్.. ఇదే సాక్ష్యం
Sudigali Sudheer : ఈటీవీ లో మల్లెమాల వారి జబర్దస్త్ కామెడీ షో ప్రసారం అవుతూ తొమ్మిది సంవత్సరాలుగా నెంబర్ వన్ కామెడీ షో గా నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గుర్తింపు దక్కించుకున్నారు. కొందరు కమెడియన్స్ జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుండగా ఎక్కువ శాతం మంది వేర్వేరు కారణాలతో ఇతర చానల్స్ కి వెళ్లడం.. కొందరు సినిమా లో సెటిల్ అవడం జరిగింది. జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘ కాలమే అయ్యింది. ఆయన జర్నీ జబర్దస్త్ ప్రారంభం అయిన కొన్నాళ్ళకి ప్రారంభమైంది. సుడిగాలి సుధీర్ టీం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వస్తుంది. ఆయన కామిడీ స్కిట్లు అంటే కచ్చితంగా ప్రేక్షకులు చూడాల్సిందే అన్నట్లుగా ఉంటారు.టీవీలో మిస్ అయినా కూడా యూట్యూబ్లో చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
సుడిగాలి సుదీర్ కామెడీ స్కిట్స్ కి అత్యధిక వీడియోస్ రావడం మనం ఇంతకు ముందు వరకే గమనించాము. కానీ ఇప్పుడు ఆ రికార్డును హైపర్ ఆది బ్రేక్ చేశాడు. హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ ల మద్య పోటీ అన్నట్లుగా పుష్ప సినిమా పేరడీ కామెడీ గా చేశారు. ఇద్దరు కూడా సూపర్ గా చేశారు అంటూ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. అయితే ఈ కామెడీ స్కిట్లు యూట్యూబ్ లో నువ్వా నేనా అన్నట్లు గా పోటీ పడుతున్నాయి. రెండు కామెడీ స్కిట్ లు కూడా యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్ ను దక్కించుకున్నాయి. కానీ హైపర్ ఆది స్కిట్ మాత్రం 20 లక్షలు అదనంగా వ్యూస్ సొంతం చేసుకున్నాయి.ఈ విషయంలో హైపర్ ఆది కచ్చితంగా పైచేయి సాధించాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప పేరడీ హైపర్ ఆది అద్భుతంగా చేశాడు

Hyper Aadi vs Sudigali Sudheer in Jabardast About Pushpa Movie Comedy Skit
అందులో ఎలాంటి డౌట్ లేదు. శ్రీవల్లి గా ప్రస్తుత ట్రెండ్ ఇంకా కమెడియన్ అయిన ఫైమా చేసింది. దాక్షాయణి గెటప్ ను శాంతి స్వరూప్ లేడి గెటప్ తో వేశాడు. కేశవ గా రియల్ క్యారెక్టర్ ని తీసుకొచ్చారు. ఐటమ్ సాంగ్ ని కూడా చేయించడం ద్వారా హైపర్ ఆది స్కిట్ బాగా వచ్చింది. కానీ సుడిగాలి సుదీర్ చేసిన పుష్ప మాత్రం ఎక్కువ మంది కంటెస్టెంట్ లేకుండా సింపుల్గా సాగింది. అయినా కూడా 11 మిలియన్ల వ్యూస్ రావడం జరిగింది. ఈ లెక్కన పోలిస్తే సుధీర్ స్కిట్ గ్రేట్ అంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. అలా ఒకరి అభిమానులు మరొకరి పై కామెంట్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ లో మాత్రం హైపర్ ఆది పుష్ప స్క్రిప్టు దూసుకు పోతుంది. కనుక సుడిగాలి సుదీర్ పై హైపర్ ఆది పై చెయ్యి సాధించాడు అంటూ క్లీయర్ గా ఆ వ్యూస్ తో క్లారిటీ వచ్చేసింది.