Allu Arjun – Sneha Reddy : హాలీడే మూడ్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. పిల్లలతో కలిసి ఎక్కడికి చెక్కేశారో తెలుసా?
Allu Arjun – Sneha Reddy : అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి.. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ అయితే ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఇక.. స్నేహారెడ్డి మాత్రం ఆయన్ను పెళ్లి చేసుకొని స్టార్ డమ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని తెగ ప్రయత్నిస్తుంది స్నేహారెడ్డి. అందులో భాగంగానే స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో తన ఫోటోషూట్స్ ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. తనకు సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు స్నేహారెడ్డి షేర్ చేసుకుంటూ ఉంటుంది.ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కాస్త ఖాళీ సమయం దొరికినట్టుంది.
Allu Arjun – Sneha Reddy : హాలీడేకి సంబంధించిన ఫోటోలు వైరల్
వెంటనే తన ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు. తన పిల్లలు, వైఫ్ తో కలిసి అల్లు అర్జున్ తాజాగా హాలీడేకి వెళ్లారు. అక్కడ వీళ్లు సూపర్ గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అల్లు స్నేహారెడ్డి అయితే తన పిల్లతో ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహారెడ్డి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
