Samantha – Naga Chaitanya : సమంత ఎదురుగా వస్తే అదే చేస్తా.. ఒక్క మాటలో చెప్పిన నాగ చైతన్య..!
Samantha – Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగ చైతన్య విడిపోయి దాదాపు 10 నెలలు పూర్తి కావొస్తుంది. అయినప్పటికీ వీరి వివాహ బంధానికి ఎందుకు బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. సామ్ పెద్దింటి కోడలు అని ఆలోచించకుండా పెళ్లయ్యాక బోల్డ్ సినిమాలు చేయడం వల్లే ఇలా జరిగిందని, చైతూ సమంతను పట్టించుకోకుండా వేరే వారికి దగ్గరయ్యాడని అందుకే వీరి మధ్య గొడవలు జరిగి విడిపోయారనే వార్తలు నేటికీ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో వాస్తవం ఎంతుందో అక్కినేని కుటుంబానికి, సమంత సన్నిహితులకే తెలియాలి.
సామ్ చై విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కానీ అసలు కారణం మాత్రం లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఏదేమైనా టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సామ్ చై విడిపోవడంతో చాలా మంది తమ బాధను వ్యక్తంచేశారు. ఇలా జరిగి ఉండాల్సి కాదని కామెంట్స్ చేశారు. తీరా సామ్ చై విడిపోయి ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోగా ఎవరికి నచ్చిన న్యూస్ వారు సొంతంగా రాసేసుకున్నారు.
Samantha – Naga Chaitanya : సామ్ కనిపిస్తే ఇదే చేస్తా..
సామ్ చై ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పుడప్పుడు మీడియాతో ముచ్చటిస్తున్నారు.ఇందులో వారు పర్సనల్ లైఫ్ గురించి అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తున్నారు.మొన్నటికి మొన్న సమంత కాఫీ విత్ కరణ్‌లో పాల్గొంది. కరణ్ జోహర్ వేసిన అన్ని ప్రశ్నలకు చకాచకా సమాధానాలు చెప్పింది. చైతూ నీతో ఉండాలని కోరితే ఏం చేస్తారని అడుగగా..మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన వస్తులేవీ లేకుండా చూసుకోవాలంటూ సామ్ సూటిగా సమాధానం చెప్పింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా సమంత మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని అడగ్గా.. ఆమెకు హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటూ సమాధానం చెప్పాడు. దీంతో చై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా భవిష్యత్‌లో మీరిద్దరూ కలిసి సినిమా చేయాల్సి వస్తే ఏం చేస్తారు అని అడుగగా.. అలాంటి అవకాశం వస్తే చాలా బాగుంటుందని చైతూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.