Indraaniel : అసిస్టెంట్ చేసిన పనికి కన్నీళ్లు.. ఇంద్రనీల్ భార్య మేఘన పోస్ట్ వైరల్
indraaniel Wife Meghna Raami బుల్లితెరపై ఇంద్రనీల్ మేఘన జోడికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. వీరి ప్రేమ, పెళ్లి కథే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సీరియల్‌లో అత్తా, అల్లుడిగా నటించిన ఈ ఇద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిపోయారు. సీరియల్ షూటింగ్ సమయంలోనే వీరి ప్రేమ చిగురించింది. చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అలా చక్రవాకం, మొగలి రేకులు సీరియల్‌లు ఈ ఇద్దరి జీవితాల్లో అలా ఎప్పటికీ చెరగని ముద్ర వేసేశాయి. ఇంద్రనీల్ ఒకప్పుడు బుల్లితెరపై స్టార్‌లా వెలిగిపోయాడు.

indraaniel Wife Meghna Raami Assistant Tattoo
ఇంద్రనీల్ భార్య మేఘన పోస్ట్ వైరల్ indraaniel Wife Meghna Raami
ఇప్పుడు ఇంద్రనీల్ indraaniel Wife Meghna Raami ఎక్కువగా సీరియల్స్‌లో కనిపించడం లేదు. ఇక మేఘన మాత్రం జీ తెలుగులో దుమ్ములేపుతోంది. రాధమ్మ కూతురు సీరియల్‌లో మేఘన లీడ్ రోల్ పోషిస్తోంది. అలా జెమినీ టీవీ నుంచి ఇప్పుడు మేఘన జీ తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే మేఘన సోషల్ మీడియాలో మాత్రం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తమ అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

indraaniel Wife Meghna Raami Assistant Tattoo
ఎన్నో ఏళ్ల నుంచి తమ వద్ద పని చేస్తూ.. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకునే అసిస్టెంట్ కిషోర్.. తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడట. అసిస్టెంట్‌కు తామంటే ఎంత ప్రేమో తెలుసు కానీ మరి ఇంత పచ్చబొట్టులా పొడిపించుకుని, నా బర్డ్ డేను ఇలా సర్ ప్రైజ్ చేస్తాడని అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది. అసిస్టెంట్ కురిపించిన ప్రేమకు నా కళ్లలో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయింది. నీ జీవితంలో మాకు ఇంత మంచి స్థానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ మేఘన చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి ==> కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. ఈ సారి అంతకు మించేలా?
ఇది కూడా చదవండి ==> కష్టాల్లో జబర్దస్త్ చంటి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేక అలా!
ఇది కూడా చదవండి ==> అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!