Inside Talk : ఇండస్ట్రీలో బుద్దిలేని అడ్డ గాడిదలు ఎక్కువ అయ్యారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Inside Talk : ఇండస్ట్రీలో బుద్దిలేని అడ్డ గాడిదలు ఎక్కువ అయ్యారు

 Authored By aruna | The Telugu News | Updated on :18 January 2022,7:20 pm

Inside Talk : ఒక వైపు తెలుగు సినిమా పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సక్సెస్ రేటు కనీసం 10 శాతం కూడా లేదు. ఏడాదిలో వందలాది సినిమాలు విడుదల అయితే అందులో కనీసం అయిదు పది కూడా సక్సెస్ ను దక్కించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు సమస్యల పరిష్కారంకు ప్రయత్నించాలి. సినిమా ఇండస్ట్రీ ప్రతి ఏడాది కోట్లాది రూపాయలను నష్టపోతున్న ఈ సమయంలో అనూహ్యంగా ఏపీలో టికెట్ల రేట్లను తగ్గించడం తో ఆ నష్టం మరింతగా ఎక్కువ అయ్యింది. తెలుగు సినిమాల వసూళ్లలో మెజార్టీ వసూళ్లు ఏపీ నుండి వస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే అక్కడ టికెట్ల రేట్ల ను పెంచాల్సిందే అంటూ విజ్ఞప్తి వ్యక్తం చేస్తుననారు.

ఈ విషయమై స్పందించేందుకు కొందరు భయపడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ప్రభుత్వంకు అనుకూలంగా ఉంటూనే సాధ్యం అయితే పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా పెద్దరికం తీసుకుని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లారు. అక్కడ టికెట్ల రేట్ల విషయమై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నించారు. ఏపీ ప్రజలకు వినోదాన్ని తక్కువ రేటుకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. కాని ఈ సమయంలో తెలుగు సినిమా కూడా బతకాలి కదా అన్నట్లుగా చిరంజీవి ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో చిరంజీవిని ఇండస్ట్రీలో కొందరు విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.

Inside Talk industry Talks

Inside Talk industry Talks

Inside Talk : చిరంజీవి ఏం చేసినా కూడా ఎందుకు విమర్శలు

టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కొందరు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిని చిరంజీవి కలవడం పట్ల విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా సమస్యలను అడ్డు పెట్టుకుని చిరంజీవ రాజకీయంగా మళ్లీ తన ప్రస్థానంను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు అంటూ విమర్శలు చేస్తున్న వారు ఎక్కువ అయ్యారు. సీఎం జగన్ మోహన్‌ రెడ్డిని రాజ్యసభ సీటు అడిగినట్లుగా కూడా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి ఇప్పటికే తనకు రాజకీయం చేసే ఉద్దేశ్యం లేదని క్లారిటీ ఇచ్చినా కూడా అస్సలు చిరంజీవిని వదలడం లేదు. చిరంజీవి రాజకీయ ఉద్దేశ్యం లేదని చెప్పినా కూడా అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూ అడ్డగాడిదల మాదిరిగా విమర్శలు చేస్తున్నారంటూ చిరంజీవి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది