Sukumar : ‘పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ‘ డైలాగ్ ను ఎక్కడి నుంచి రాసుకున్నారో చెప్పేసిన సుకుమార్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sukumar : ‘పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే ‘ డైలాగ్ ను ఎక్కడి నుంచి రాసుకున్నారో చెప్పేసిన సుకుమార్ ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2023,6:00 pm

Sukumar : ఇండస్ట్రీలో ‘ పుష్ప ‘ సినిమా ఎటువంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో ఆ సినిమాలోని పాటలకుర డైలాగులకు అంతకన్నా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాను దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప సినిమాలో డైలాగ్స్ ఎలా రాసుకున్నారో చెప్పుకొచ్చారు. ‘ పుష్ప.. పుష్ప రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే ‘ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు.

ఇప్పటికీ ఈ డైలాగును సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ వాడుతున్నారు. అయితే సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అనుకున్నప్పటినుంచి మంచి స్టోరీ ఇప్పటివరకు తెరపై చూడని రియాలిస్టిక్ గా ఉండే స్టోరీని చూపించాలనుకున్నారట. ఈ క్రమంలోనే పుష్ప స్టోరీని రెడీ చేశారు. అయితే కథ రాసుకుంటున్న టైంలో సుకుమార్ పలు ప్రదేశాలు తిరిగి మరి సినిమాలో డైలాగ్స్ రాసుకున్నారట. ఈ క్రమంలోనే ఆయన చిత్తూరు కి వెళ్లారట. అక్కడ ఓ అరుగుపై కూర్చొని కథ రాసుకుంటున్న టైంలో అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది.

Sukumar Interesting news about pushpa movie dialogues

Sukumar Interesting news about pushpa movie dialogues

సాధారణంగా గొడవ పడుతున్నప్పుడు బూతు మాటలు మాట్లాడుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు గొడవ పడుతూ బూతు మాటలతో తిట్టుకుంటున్నారట. ఆ టైంలోనే నీ అవ్వ ..అంటూ నేను తగ్గను నువ్వే పో అంటూ రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకున్నారట. ఈ క్రమంలోనే సుకుమార్ ఆ డైలాగ్స్ ని తన సినిమాలో వాడేలా ముందు పుష్ప రాజ్ పేరును యాడ్ చేసి ఆ డైలాగ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరు గొడవ పడడంతో పుష్ప సినిమాలో డైలాగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుకుమార్ క్రియేటివిటీ మామూలుగా లేదు అంటూ జనాలు పొగిడేస్తున్నారు. మరీ డైరెక్టర్ కి ఉండాల్సిన లక్షణం ఇదే కదా.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది