Intinti Gruhalakshmi 01 August 2022 Episode : తులసికి సపోర్ట్ గా ఉంటానన్న సామ్రాట్..! నేను నీ భర్తనని సామ్రాట్ చెప్పద్దన్న నందు..!

Intinti Gruhalakshmi 01 August 2022 Episode : నందు సామ్రాట్ తో మనం ఒక కమర్షియల్ ప్లేస్ లో మీకు స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కదా సార్.. కేవలం ఒక్క స్కూల్ కోసమే ఆ ప్లేస్ యూస్ చేస్తే కరెక్ట్ కాదు సార్.. ఒక మల్టీప్లెక్స్ ప్లాన్ చేసి అందులో ఒక ఫ్లోర్ అంతా మ్యూజిక్స్ స్కూల్ పెట్టి మిగతా ఫ్లోర్సులో కమర్షియల్ బిజినెస్ చేయాలని నేను ఆలోచించాను కానీ తులసి గారికి ఆ ఐడియా నచ్చడం లేదు అని నందు చెబుతాడు.. ఇలా చేస్తే మ్యూజిక్ స్కూల్ ని ప్రపోజల్ నుంచి బ్యాక్ అవుట్ అవుతానని అంటున్నారు సార్.. ఇజ్ ఇట్.. ఈ రోజుల్లో దేవుడు గుడిలో కూడా కమర్షియల్ యాంగిల్ ప్లాన్ చేస్తున్నరు.. ఒక కుటుంబంలో ప్రతి తండ్రి ప్రతి విషయాన్ని ఆర్థిక కోణంలో ఆలోచిస్తాడు.. కానీ తల్లి బిడ్డకు అన్నం తినిపిస్తూ దానివల్ల తనకేం లాభం అని ఆలోచించదు..

Advertisement

ఇందాక నందగోపాల్ గారు గుడి గురించి చాలా విషయాలు చెప్పారు.. కానీ మనం వెళ్లిన కొన్ని గుడిలలో మాత్రమే మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.. నా మ్యూజిక్ స్కూల్ కి వచ్చే పిల్లలకు కూడా నేను అది అందించాలి అని అనుకుంటున్నాను.. ఇది తప్ప సర్ అని తెలిసి సామ్రాట్ ని అడుగుతుంది.. కాదు అని సామ్రాట్ చెబుతాడు.. అందులో ఏదో చెప్పబోతుండగా సామ్రాట్ అడ్డుపడతాడు.. ఈ రోజుల్లో విద్య ఎలాగూ కమర్షియల్ అయిపోయింది.. దానిమీద ఎలా సంపాదించాలని అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు.. సంగీతం కలను కూడా అలా చేయకండి సర్.. పచ్చని ప్రకృతి మధ్య పక్షుల కిలకిల రావాలని ఆస్వాదించేలాగా పిల్లలు నేర్చుకోవాలి.. దీన్ని కూడా కమర్షియల్ చేయకూడదని నా ఆలోచన సార్ అని తులసి అంటుంది..

Advertisement
Intinti Gruhalakshmi 01 August 2022 Full Episode
Intinti Gruhalakshmi 01 August 2022 Full Episode

కొంతమంది మనుషులు జీవితాన్ని కూడా వ్యాపారంగానే చూస్తారు.. కట్టుకున్న భార్య మనసుకు నచ్చకపోతే మోజుకు తీరిపోతే ఆ కథలను తెంపుకొని మరొకరితో కలిసి వెళ్లిపోతారు.. లాభనష్టాలు బేరీజు వేసుకుంటరు.. సార్ నా వల్ల మీకు నష్టం జరుగదు.. అని చెప్పేసి తులసి వెళ్లిపోతుండగా ఒక్కసారి ఆగండి తులసి అని మిస్టర్ నందగోపాల్ తులసి ఎలా ఆ బిల్డింగ్ ప్లాన్ కావాలనుకుంటుందో.. అలా డిజైన్ చేయమని సామ్రాట్ చెబుతాడు.. తులసి గారు మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి నేను మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను..

ప్రశాంతతను పవిత్రతను అందించే గుడినే కడదామండి.. థాంక్యూ సార్ అని సామ్రాట్ కి చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.. ఈరోజు ఇద్దరు కలిసి దండాలు పెట్టుకున్నారు రేపటి రోజున ఇద్దరు కలిసి దండలు మార్చుకుంటారు అని లాస్య నందు మైండ్ ను పొల్యూట్ చేస్తుంది.. రేపటి ఎపిసోడ్లో నందు తులసి దగ్గరకు వచ్చి నేను నీ మాజీ భర్తని సామ్రాట్ గారికి చెప్పొద్దు అని అంటాడు.. మీరు నా ముగ్గురు పిల్లలకు తండ్రి.. నేను సామ్రాట్ కి నిజం చెప్పను.. కానీ ఆయన తెలుసుకుంటే మాత్రం నేను ఏమీ చేయలేను అని తులసి అంటుంది..

Advertisement